భారత్–యూఏఈ మధ్య ప్రయాణ విధానాన్ని పూర్తిగా మార్చివేసే ఓ సంచలన ప్రాజెక్ట్‌కు (MegaProject) రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. ముంబై నుంచి దుబాయ్ వరకు అరేబియా సముద్రం అడుగున హైస్పీడ్ రైలును నడపాలనే ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే విమాన ప్రయాణాన్ని మించిపోయే వేగంతో ప్రయాణికులు గమ్యానికి చేరుకునే అవకాశం ఉంది.
Read Also: TG: మద్యం వినియోగంలో తెలంగాణ టాప్
ముంబై నుంచి దుబాయ్ వరకు సముద్రం అడుగున హైస్పీడ్ రైలు ప్రతిపాదన
‘డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్’గా పిలుస్తున్న ఈ అండర్‌వాటర్ రైలు గంటకు 600 నుంచి 1,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని అంచనా. దీంతో ప్రస్తుతం 3 నుంచి 3.5 గంటలు పడుతున్న ముంబై–దుబాయ్ విమాన ప్రయాణం కేవలం రెండు గంటలకే పరిమితం కానుంది.
ఈ ప్రాజెక్ట్‌లో(MegaProject) ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది సముద్ర మట్టానికి దాదాపు 200 మీటర్ల లోతులో నిర్మించే టన్నెల్. దీనిలో పనోరమిక్ గాజు కిటికీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు రైల్లో కూర్చునే సమయంలో బయట తిమింగలాలు, షార్కులు, ఇతర సముద్ర జీవులు ఈదుతూ కనిపించేలా డిజైన్ చేయనున్నారు. సూపర్ ఫాస్ట్ ప్రయాణంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌వాటర్ అక్వేరియంలో ప్రయాణిస్తున్న అనుభూతిని ఇది అందించనుంది.
సుమారు 50 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ప్రయాణికుల రవాణాతోనే పరిమితం కాకుండా వాణిజ్య రంగానికీ ఉపయోగపడనుంది. యూఏఈ నుంచి భారత్‌కు ముడి చమురు రవాణా, భారత్ నుంచి యూఏఈకి స్వచ్ఛమైన నీటి సరఫరా వంటి అంశాలు కూడా ఇందులో భాగమయ్యే అవకాశం ఉంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ వ్యయం దాదాపు 60 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముంబైగా మారనున్న గ్లోబల్ ట్రాన్సిట్ హబ్
ఈ అండర్‌వాటర్ రైలు ప్రాజెక్ట్ పూర్తయితే ముంబై నగరం అంతర్జాతీయ వాణిజ్యం, రవాణాకు కీలక కేంద్రంగా ఎదగనుంది. ఈ నిర్మాణం ద్వారా దాదాపు 50 వేల మందికి కొత్త ఉద్యోగాలు లభించే అవకాశముందని అంచనా. ప్రస్తుతం భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ఇది అమలులోకి వస్తే ప్రపంచ రవాణా చరిత్రలోనే ఓ విప్లవాత్మక అడుగుగా నిలవనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: