📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Medical mafia : ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియా!

Author Icon By Sudha
Updated: November 27, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైద్యం వ్యాపారం కాకూడదు. అది మానవ సంక్షేమానికి పునాది కావాలి. ప్రతి మెడిసిన్ మనిషి కోసం తయా రు కావాలి. కానీ మనుషులను బలితీసుకోవద్దు. మెడికల్ ఎథిక్స్ లో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులు చేసే వ్యాఖ్యలివి. కానీ ప్రపంచవ్యాప్తంగా దీనికి పూర్తి విరు ద్ధంగా జరుగుతున్నది. ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిస్థితే “కనిపిస్తున్నది. ఇటీవల కరీంనగర్లో వెలుగుచూసిన ఘటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఆందోళన లోకి నెట్టింది. వైద్య శిబిరాల పేరుతో మెడికల్ క్లినికల్ ట్రయల్స్ మాఫియా (Medical mafia) అమాయకులను టార్గెట్గా చేసుకొని ప్రయోగాలు చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతుండ డం ఆందోళనకు గురిచేస్తున్నది. ఇలాంటి వాటిని నియంత్రించడంలో డీసీజీఐ వంటి సంస్థలు విఫలమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏదైనా ఔషధానికి సంబంధించి ట్రయల్సన్న ముందుగా జంతువులపై చేస్తారు. అక్కడ సక్సెస్ అయితే ఆ తర్వాత తగిన పరిహార హామీతో, రోగి అంగీకారాన్ని తీసుకొని కఠిన నిబంధనలను అనుసరించి మనుషులపై చేస్తారు. అయితే అలాంటిదేమీ చేయకుండానే వైద్యశిబిరాలు, ఆర్థికసాయం వంటి వాటితో మెడికల్ మాఫియా (Medical mafia) పేదలను టార్గెట్గా చేసుకొని డైరెక్ట్ మనుషు లపైనే ఔషధ ప్రయోగాలను అక్రమంగా, రహస్యంగా చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో కరీంనగర్లోని కొత్తపల్లికి చెందిన కొందరు యువకులు ఔషధ ప్రయోగాల్లో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరు మతి స్థిమితం కోల్పోయినట్టు అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఅంశం 2017లో సంచలనం సృష్టించింది. తాజాగా కూడా ఓ వ్యక్తి తనపై ఔషధ ప్రయోగాలు చేశా రని పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. అయితే వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉంటాయనే చర్చ ఉన్నది. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఔష ధాలు, టీకాలు కనుగొనడం మానవాళికి మేలు చేసినా, నైతిక నియమాలు పాటించకుండా చేసిన ప్రయోగాలు ఎంతో ప్రాణనష్టాన్ని, వైకల్యాలను మిగిల్చాయి.

Read Also : http://EPS Pensions: పెన్షనర్లకు భారీ బెనిఫిట్: 800% పెరిగే EPS పెన్షన్

Medical mafia

విస్తరిస్తున్న మెడికల్ మాఫియా

2006లో లండన్ లో ఆరుగురు ఆరోగ్యకరమైన వాలంటీర్లకు యాంటీబాడీ డ్రగ్ ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే వారి రోగనిరోధక వ్యవస్థ నాశనం అయింది. వీరంతా బతికినా, తీవ్రమైన శారీరక వైకల్యం, అవయవాల వైఫల్యానికి గురయ్యారు. 2016లో ఫ్రాన్స్లో జరిగిన న్యూరో డిసార్డర్ డ్రగ్ ట్రయల్లో ఆరుగురు వాలంటీర్లలో ఒకరు మరణించగా, మిగిలిన ఐదు గురు మెదడు సంబంధిత రోగాలకు గురయ్యారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వేలాది మంది మరణిస్తూనే ఉన్నారు. భారతదేశం గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ రాజధానిగా మారుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతు న్నది. తక్కువ ఖర్చు,అధిక సంఖ్యలో పేద జనాభా, తగినంత అవగాహన లేమి దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) డేటా ప్రకారం2021 నుంచి 2025 జులై వరకు దేశవ్యాప్తంగా 1,705 మంది క్లినికల్ ట్రయల్స్ లో మరణించారు. ఇది రోజుకు ఒక మరణానికి సమానం. అంతేకాకుండా ఏడువేల మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురికాగా, చాలా మంది శాశ్వత వికలాంగులుగా మారారు. 2005 నుంచి 2012 మధ్యకాలంలో 2600 మందికిపైగా మరణించారు. సుమారు 12వేల మంది తీవ్రమైన దుష్ప్రభావాలకు గురయ్యారు. వీటిలో 80 మరణాలు, 500కు పైగా తీవ్ర దుష్ప్రభావాలు నేరుగా మనషులపై ఔషధాలు ప్రయోగించడం కారణంగానే జరిగాయని తేలింది. 2005-2013 వరకు 2644 మంది మరణించగా, ఇందులో కేవలం 17 మందికి మాత్రమే పరిహారం అందింది. 2010లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 24 వేలమంది బాలికలపై హెచ్పీవీ వ్యాక్సిన్ ట్రయల్స్ జరగ్గా ఏడుగురు మరణించడం తీవ్రవివాదాన్ని సృష్టించిం ది. తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేకుండా, నైతిక నిబంధ నలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. అక్రమ క్లినికల్ ట్రయల్స్ ప్రాణాలను బలి తీసుకోవడం, వైకల్యాలను మిగల్చడం మాత్రమే కాకుండా సమాజంపై తీవ్ర దుష్ప్ర భావం చూపుతాయి. పేద, సాధారణ ప్రజలు వైద్యం చేయించుకోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. వైద్యులు, ఆస్పత్రులపై నమ్మకం పోతుంది. సరికొత్త ఔష ధాలు, చికిత్సలు మానవాళికి అవసరం. కానీ వాటి కోసం చేసే ప్రయోగాలు నైతిక నియమాలు, మానవ హక్కుల పరిధిలోనే జరగాలి. అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించే లాభాల కంటే మానవత్వం, భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అక్రమాలకు పాల్పడే మెడికల్ మాఫి యాను కఠినంగా శిక్షించడం, క్లినియర్ ట్రయల్స్ నియంత్ర ణను మరింత పటిష్టం చేయడం తక్షణ కర్తవ్యం.
-మహమ్మద్ ఆరిఫ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News corruption-in-healthcare healthcare-issues latest news medical-mafia medical-negligence patient-safety Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.