ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో విస్తృత సమావేశం పిలుపు
హైదరాబాద్ (చిక్కడపల్లి) : అంతర్జాతీయ, జాతీయ పరిస్థితుల నేపథ్యంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో కమ్యూనిస్టు వామపక్ష శక్తుల ఏకీకరణ కావాల్సిన చారిత్రక నేపథ్యం ఏర్పడింది అని ఎంసిపిఐ (యు) (MCPIU Leaders) జాతీయ నేతలు మద్ది కాయల అశోక్ ఓంకార్ పిలుపు కుల్దీప్ సింగ్ ఓంకార్ భవన్లో రెండు రోజులపాటు ఎంసిపిఐ నిచ్చారు. బాగ్ లింగంపల్లి (యు) పొలిట్ బ్యూరో విస్తృత సమావేశం కుల్దీప్ సింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Read Also: Modi: ప్రతికూల రాజకీయాలకు ప్రజలు గుడ్‌బై: కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు
ఒకే ఆర్గనైజేషన్గా ఏర్పడాలని కీలక నిర్ణయం
2018 నుంచి కొన్ని స్వల్ప భిన్నాభిప్రాయాలు కలిగి వేరువేరు ఆర్గనైజేషన్గా పనిచేసిన పార్టీ ఈ (MCPIU Leaders) సమావేశంలో ఒకే ఆర్గనైజేషన్గా ఏర్పడాలని, ఇందులో భాగంగా ఫిబ్రవరి 23 24 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రం జోద్పూర్ లో ఆలిండియా ఐక్య కన్వెన్షన్ నిర్వహించాలని ఈ కన్వెన్షన్కు తెలంగాణ, (TG) ఆంధ్రప్రదేశ్, బీహర్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, కేరళ, తమిళ నాడు రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులను సమావేశం ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు వామపక్ష శక్తులను ఏకీకరణ చేసే పనిని వేగవంతం చేయాలని వర్గ, సామాజిక ప్రజా పోరాటాలను బలోపేతం చేయడం ద్వారా దేశం లో మనువాద ఫాసిస్టు కార్పోరేట్ ఆర్థిక నియంతృత్వ శక్తులను ఓడించాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు వామపక్ష శక్తుల ఐక్యత ఏకైక మార్గం అని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశం లో యంసిపిఐ (యు) జాతీయ నేతలు గాదగోని రవి వల్లెపు ఉపేందర్ రెడ్డి, తెలంగాణ, కిరణ్ జిత్ సింగ్ షేఖాన్, ప్రేం సింగ్ భంగ్ పంజాబ్, కాటం నాగ భూషణం ఆంధ్రప్రదేశ్, అనుభవ్స్, ఉత్తర ప్రదేశ్, రాంపాల్ పైనీ, మహేందర్ నేహా, నదీం ఖాన్ రాజస్థాన్, భూప్ నారాయణసింగ్, మనో రంజన్ ఠాకూర్ బీహార్, డెన్నిస్, దామోదర్ ఉన్ని కృష్ణన్ పొట్టి కేరళ పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: