📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Ahmedabad Plane Crash : ‘మేడే కాల్’ చేసిన పైలట్..అసలు మే డే కాల్ అంటే ఏమిటి?

Author Icon By Sudheer
Updated: June 12, 2025 • 6:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) ముందు పైలట్ “మేడే కాల్” పంపినట్లు అధికారులు వెల్లడించారు. విమానమై ప్రయాణికుల భద్రత ప్రమాదంలో ఉందని పైలట్ గుర్తించిన వెంటనే అత్యవసర సంకేతంగా ఈ మేడే కాల్‌ ఇచ్చారు. ఇది విమాన, నౌకాయాన రంగాల్లో అత్యంత అత్యవసర సహాయ సంకేతంగా పరిగణిస్తారు.

‘మేడే మేడే’ అంటే ఏమిటి?

‘మేడే’ (Mayday) అనేది ఫ్రెంచ్ పదమైన “M’aider” నుండి ఉద్భవించింది, దాని అర్థం “సహాయం చేయండి”. ఈ పదాన్ని 1920ల నుంచి ప్రపంచవ్యాప్తంగా విమాన, నౌకా రవాణా వ్యవస్థలు ఉపయోగిస్తున్నాయి. ఒక విమానం లేదా నౌక ప్రమాదంలో ఉంటే, పైలట్ లేదా కెప్టెన్ రేడియో ద్వారా “Mayday Mayday Mayday” అని మూడు సార్లు చెబుతారు. వెంటనే సమీప ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) లేదా నౌకాశ్రయం అప్రమత్తమవుతుంది. అలా వెంటనే సహాయక చర్యలు ప్రారంభమవుతాయి.

విమాన భద్రతలో మేడే కాల్ ప్రాధాన్యత

‘మేడే కాల్’ ఒక విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇచ్చే కీలక సంకేతం. ఇది ఏ మామూలు కమ్యూనికేషన్ కాల్ కాదు. ఇది పైలట్ జీవితం మీద, ప్రయాణికుల భద్రత మీద తీవ్రమైన ముప్పు ఉన్నదనే సూచన. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూడా పైలట్ చివరి నిమిషంలో మేడే కాల్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో ఏ పరిస్థితుల మధ్య ఆ కాల్ ఇచ్చారన్నది ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అయినప్పటికీ, ఈ సంకేతం వల్ల కనీసం ఘటన తీవ్రతను ముందు అంచనా వేయడం సాధ్యమవుతుంది.

Read Also : Green Gram : పెస‌లు స్నాక్స్‌లాగా తింటే ఎంతో మేలు..!

Ahmedabad plane crash May Day Call Details Mayday May day call

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.