Matsya 6000: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకమైన సముద్రయాన్ కార్యక్రమంలో భాగంగా త్వరలో కీలక దశలోకి అడుగుపెట్టనుంది. సముద్రాల లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను వెలికితీయడం, ఖనిజ వనరులను గుర్తించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
Read Also: SBI: ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై కొత్త చార్జీలు
5,000 మీటర్ల లోతులో ప్రయోగాత్మక పరీక్షలు
ఈ కార్యక్రమంలో భాగంగా ‘మత్స్య–6000’ పేరిట రూపొందించిన సబ్‌మర్సిబుల్ వాహనం ద్వారా చెన్నై తీరానికి సమీపంలో సుమారు 5,000 మీటర్ల లోతులో ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టారు. సముద్ర గర్భంలోకి వెళ్లి డేటా సేకరించడం(Data collection), పరికరాల సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ ట్రయల్స్ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ పరీక్షలు విజయవంతమైతే, 2026 లేదా 2027 నాటికి మానవులతో కూడిన సముద్రయాన్ మిషన్‌ను ఇస్రో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం లోతైన సముద్ర పరిశోధనలో ప్రపంచ దేశాలతో సమానంగా నిలవనుందని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: