📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: Traffic Jam: బాబోయ్! భారీ ట్రాఫిక్​ జామ్..4 రోజుల పాటు రోడ్లపైనే తిండి, నిద్ర

Author Icon By Vanipushpa
Updated: October 8, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా ఒక పది నిమిషాలు వాహనాలు కదలకుండా ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయితే చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటింది 4 రోజుల నుంచి వాహనాలు ఒకే ప్లేస్‌లో ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవాలి. అయితే బిహార్‌లోని ఢిల్లీ-కోల్‌కతా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత 4 రోజుల నుంచి ఎన్నో వాహనాలు ట్రాఫిక్ జామ్‌లోనే చిక్కుకునిపోయాయి. కేవలం 5కిలో మీటర్లు మాత్రమే వాహనాలు కదిలాయి. ఎక్కడ ఉన్న వాహనాలు అక్కడే ఉన్నాయి. డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల నుంచి ఆ వాహనాల్లోనే తిండి, నిద్ర చేస్తున్నారు. ఇంత ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడినా కూడా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jishnu Dev Varma: టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలి

Traffic Jam: బాబోయ్! భారీ ట్రాఫిక్​ జామ్..4 రోజుల పాటు రోడ్లపైనే తిండి, నిద్ర

రోహ్‌తాస్ నుంచి ఔరంగాబాద్ వరకు ఈ ట్రాఫిక్ జామ్

బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఎన్​హెచ్​19లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో కేవలం నేషనల్ హైవే మీద మాత్రమే వాహనాలు వెళ్లడంతో ట్రాఫిక్ భారీగా పెరిగింది. కిలో మీటరు దూరం ప్రయాణించడానికి కూడా కొన్ని గంటల సమయం పడుతోంది. రోహ్‌తాస్ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు ఈ ట్రాఫిక్ జామ్ విస్తరించింది. దీంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల్లో కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే వాహనాలు కదులుతుున్నాయి. రోజుల తరబడి ట్రాఫిక్‌లో ఉండటంతో ఆకలి, నిద్ర, వాష్ రూమ్ వంటి వాటికి ఇబ్బంది పడుతున్నట్లు పలువురు తెలిపారు. వెంటనే అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

highway chaos long traffic delays public inconvenience road block stranded commuters Telugu News traffic jam transport issues travel disruption

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.