దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజు (Maruti Suzuki) కి ఇండియా లిమిటెడ్ తమ ప్రసిద్ధ SUV గ్రాండ్ విటారా (SUV Grand Vitara) గురించి కీలక ప్రకటన చేసింది. ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్‌లో లోపం కారణంగా 39,506 గ్రాండ్ విటారా యూనిట్ల (Grand Vitara units) ను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది.2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన వాహనాల్లో ఈ సమస్యను గుర్తించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
Read Also: One Plus: వినియోగదారులకు గుడ్ న్యూస్ వన్ ప్లస్ 13 పై తగ్గింపు
రీకాల్ ఎందుకు?
ఈ వాహనాల్లోని ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ ఇంధన స్థాయిని సరిగ్గా చూపించకపోవచ్చని తెలిపింది. సమస్య ఉన్న స్పీడోమీటర్ అసెంబ్లీని ఉచితంగా తనిఖీ చేసి, అవసరమైతే మార్చి ఇస్తామని స్పష్టం చేసింది. ప్రభావిత వాహన యజమానులను మారుతి (Maruti Suzuki) అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లు సంప్రదిస్తాయని కంపెనీ వివరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: