హర్యానాలోని(Haryana) ఒక పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్స్(Marriage Dance) చేస్తున్న మహిళలతో పెళ్లికొడుకు మామ తరపు వారు గొడవపడటంతో ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నాయి. నుహ్ జిల్లా మేవాట్ ప్రాంతంలో నవంబర్ 17, 2025న ఈ ఘటన జరిగింది. వివాహ వేడుకకు మరింత సందడి తీసుకురావడానికి వధువు తరపు వారు డ్యాన్సర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి పూట డీజే పాటలతో వాతావరణం ఉల్లాసంగా ఉన్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. సందడిలో భాగంగా, డ్యాన్సర్ల బృందం ప్రదర్శన ఇస్తుండగా, చుట్టూ ఉన్న బంధువులు కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే గొడవ మొదలైంది.
Read also: ఎఐతో భాషాభివృద్ధి సాధ్యమేనా?
అసభ్య ప్రవర్తనతో మొదలైన వివాదం
సమాచారం ప్రకారం, పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న ఒక మహిళా(Marriage Dance) డ్యాన్సర్‌తో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించాడు. అతను ఆ మహిళ ప్రైవేట్ పార్ట్‌ను తాకడంతో గొడవకు బీజం పడింది. దీంతో కోపోద్రిక్తుడైన డ్యాన్సర్, ఆ వరుడి మామపై చేయి చేసుకుంది. దీనికి ప్రతిగా, అతను కూడా ఆ మహిళను కొట్టడంతో వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో డ్యాన్సర్ బృందం మరియు వరుడి మామ తరపు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా బాదుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో డ్యాన్స్ ఆనందం కాస్తా, ఇరువర్గాలు కొట్టుకునే ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: