📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Maoists news : ప్రభుత్వ డెడ్‌లైన్‌కు మావోయిస్టుల రివర్స్ వ్యూహం Operation Kagar

Author Icon By Sai Kiran
Updated: January 5, 2026 • 7:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maoists news : దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31 గడువు దగ్గరపడుతుండటంతో అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు చేపట్టిన భారీ స్థాయి చర్యల నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు ‘రివర్స్ వ్యూహం’ అమలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత కూడా తాము కొనసాగుతున్నామని చూపించడమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం కొత్త ఎత్తుగడలకు తెరలేపినట్లు సమాచారం.

భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ అడవులను పూర్తిగా జల్లెడ పడుతుండటంతో దళాల భద్రత మావోయిస్టులకు ప్రధాన సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఊహించని ప్రాంతాలకు వెళ్లాలని, అవసరమైతే అడవుల నుంచి బయటికి వచ్చి మైదాన ప్రాంతాల్లోనూ నమ్మకస్తుల సహాయంతో తలదాచుకోవాలని నాయకత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. డెడ్‌లైన్ దాటిన తర్వాత మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించి ప్రభుత్వ లక్ష్యాన్ని విఫలం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు (Maoists news) ప్రాంతాల్లో మిగిలి ఉన్న కొద్దిమంది మావోయిస్టు దళాలు ప్రస్తుతం సురక్షిత స్థావరాల కోసం వెతుకుతున్నాయి. తెలంగాణకు చెందిన 17 మంది మావోయిస్టుల్లో ఎనిమిది మంది కీలక బాధ్యతల్లో ఉన్నారని సమాచారం. తిప్పిరి తిరుపతి, బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య వంటి నేతల ఆధ్వర్యంలో ఈ దళాలు కదులుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

అయితే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో పెద్ద బృందాలుగా కాకుండా, కొద్దిమంది సభ్యులతోనే రాకపోకలు సాగిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర కమిటీలోని తెలంగాణ నేతలు లొంగుబాటుకు సిద్ధంగా లేరన్న సంకేతాలు ఉన్నప్పటికీ, కింది స్థాయి కేడర్‌లో మాత్రం మార్పు కనిపిస్తోంది.

పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా లొంగిపోవాలనుకుంటే స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించడంతో కొందరు మావోయిస్టులు లొంగుబాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన డీజీపీల సమావేశంలో కూడా ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, మార్చి 31 గడువును కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం–మావోయిస్టుల మధ్య మైండ్ గేమ్ ఉత్కంఠగా కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

anti Maoist operations Breaking News in Telugu Chhattisgarh Maoists Google News in Telugu Indian Security Forces Latest News in Telugu Maharashtra Maoists Maoist reverse strategy Maoist surrender news Maoists deadline March 31 Maoists news Operation Kagar Telangana Maoists Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.