📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Telugu News: Maoist Surrender:అనంత్ సహా 12 మంది లొంగుబాటు

Author Icon By Pooja
Updated: November 29, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మావోయిస్టులకు( Maoist Surrender) వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్లలో భాగంగా, మావోయిస్టు అగ్రనేత, ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌) జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ సడన్‌గా పోలీసుల ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది. జనవరి 1న సామూహికంగా లొంగిపోతామని లేఖ రాసిన 24 గంటలు కాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయనతో పాటు మరో 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

Read Also: Duplicate Rolex watch : హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Maoist Surrender: 12 people including Ananth surrender

లొంగిపోయిన నేతలు, రివార్డుల వివరాలు

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత అనంత్‌పై ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ. కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంత్‌తో పాటు లొంగిపోయిన వారిలో ఎంఎంసీ ఇన్‌ఛార్జి మరియు విస్తార్ మూడో ప్లటూన్ కమాండర్ సురేంద్ర అలియాస్ మద్వి సీమ సైతం ఉన్నారు. సురేంద్రపై రూ. 60 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన( Maoist Surrender) మొత్తం 12 మంది మావోయిస్టుల పేరుపై మూడు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 2 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు వివరించారు. ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీ బలహీనతకు మరో నిదర్శనంగా నిలుస్తోంది.

సాయుధ పోరాటం విరమణ లేఖ, వెనుక ఉన్న కారణాలు

సమస్యేమిటంటే, అనంత్ పేరుతో ఇటీవల ఒక లేఖ విడుదలైంది. అందులో వారు 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుని, ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని పేర్కొన్నారు. కానీ లేఖ విడుదలైన కొద్ది గంటల్లోనే ఆయన లొంగిపోయారు. అయితే, తాజా లొంగుబాటు అనంతరం ఆయన విడుదల చేసిన మరొక లేఖలో… మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పార్టీ బలహీనమైందని తెలిపారు. మరోవైపు ఇతర అగ్రనేతలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనంత్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anant Alias Vikas Google News in Telugu Latest News in Telugu MMC Zone Naxalite Rs 1 Crore Reward

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.