हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Maoist: దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్

Sharanya
Maoist: దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన దండకారణ్యంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు ముమ్మరంగా దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ భారీ కూంబింగ్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్న బలగాల సంఖ్య, మావోయిస్టుల స్థితిగతులు, ప్రాంతీయ భద్రతపై ఈ చర్యల ప్రభావం

మావోయిస్టుల కీలక నేతలు

భద్రతా బలగాలకు అందిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కర్రెగుట్ట పరిసర అటవీ ప్రాంతాల్లో సుమారు 300 నుంచి 400 మంది మావోయిస్టులు తలదాచుకుని ఉన్నారు. వీరిలో CPI సెంట్రల్ కమిటీ సభ్యుడు, అత్యంత ప్రమాదకర మావోయిస్టు నాయకుడు హిడ్మా కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టి, డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

ప్రజలలో భయాందోళనలు:

ఈ ఆపరేషన్ నేపథ్యంలో భీమవరం పాడు, పూజారి కాంకేర్, పామేడు, ఊసూరు వంటి గ్రామాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. కాల్పుల శబ్దాలు, హెలికాప్టర్ల మోగుబాటలు, భారీ సంఖ్యలో బలగాల చలనం వలన వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కొందరు గ్రామస్తులు తమ ఇండ్లను విడిచి బయటకు తరలిపోతున్నారు. కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. మరోవైపు, మావోయిస్టులు కూడా భద్రతా బలగాలను ప్రతిఘటిస్తున్నారని, అడవుల్లో భారీగా మందుపాతరలు అమర్చామని హెచ్చరికలు చేస్తున్నారని తెలుస్తోంది. మావోయిస్టులను పూర్తిగా చుట్టుముట్టాం. ఇక లొంగిపోవడం లేదా హతమవ్వడం తప్ప మరో మార్గం లేదు” అని బస్తర్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇది మావోయిస్టులకు చివరి అవకాశం అన్నట్టే స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఎన్‌కౌంటర్ జరిగినట్టు సమాచారం వెలువడలేదు. కానీ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఏ సమయంలోనైనా ఎదురుకాల్పులు జరిగే అవకాశం ఉంది. కేంద్రం కూడా ఈ అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తోంది.

Read also: Encounter : మరోసారి జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. జవాన్ మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870