📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Maoist: హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

Author Icon By Sushmitha
Updated: December 5, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మావోయిస్టు పార్టీ తరపున దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (Dandakaranya Special Zonal Committee) ఒక సంచలనాత్మక లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో, కేంద్ర కమిటీ సభ్యుడు మరియు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా (మారేడుమిల్లి ఎన్‌కౌంటర్), అతనితో పాటు మరో ఐదుగురు, అలాగే కామ్రేడ్ శంకర్ (రంపాచోడవరం ఎన్‌కౌంటర్) మరణాలు ముమ్మాటికీ ‘నకిలీ ఎన్‌కౌంటర్లు’ (Fake Encounters) మరియు హత్యలే అని తీవ్రంగా ఆరోపించారు. ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపించి, దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని వారు పిలుపునిచ్చారు.

 Read Also: Emirates Flight: ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు

మావోయిస్టులు (Maoist) ఈ లేఖలో కొన్ని తప్పుడు ఆరోపణలను ఖండించారు. ముఖ్యంగా, మనీష్ కుంజాం, సోనీ సోడి ద్వారా హిడ్మా హత్యకు కామ్రేడ్ దేవజీ కారణమని ఇచ్చిన తప్పుడు ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

Maoist ‘Hidma encounter’ should be investigated

కలప వ్యాపారి ద్రోహం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హస్తం

లేఖలో మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్ల వెనుక ఉన్న అసలు కారణాలను వివరిస్తూ ఆరోపణలు చేశారు.

ఈ హత్యలకు కారకులైన వారిపై విచారణ జరపాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డిమాండ్ చేసింది. దీని వెనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, (Telangana) ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హస్తం స్పష్టంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. కలప వ్యాపారి, ఐటీడీఏకు చెందిన కారు డ్రైవరు, విజయవాడకు చెందిన డాక్టరు తదితరులతో సహా ఈ మొత్తం హత్య వెనుక ఉన్న వ్యక్తులను విచారించాలని కోరారు.

ప్రజా ఉద్యమానికి పిలుపు

కేంద్ర ప్రభుత్వంలోని పెద్ద అధికారులు ఈ హత్యలకు బాధ్యులని, ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి విదేశీ కాపలాదారులు (Foreign) సహకరించారని మావోయిస్టులు తమ లేఖలో ఆరోపించారు. తమ పోరాటం వృథా పోదని, అమరులైన వారి బాటలో నడుస్తామని కమిటీ స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టులకు కమిటీ నివాళులు అర్పించింది. మరోవైపు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ లేఖను విశ్లేషిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

ComradeShankar DandakaranyaSZC FakeEncounter Google News in Telugu HidmaDeath IntelligenceAgencies JudicialInquiryDemanded Latest News in Telugu MaoistEncounterAllegations PublicUprisingCall Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.