📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Maoist: మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు ఆయుధాలు అప్పగింత

Author Icon By Rajitha
Updated: October 27, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బస్తర్ : మావోయిస్టు (Maoist) పార్టీకి మరోసారి భారీ దెబ్బతగిలింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులు కేశ్కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, నలుగురు డివిసిఎంలు డివిజన్ వైస్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఎఎంసి ఏరియా కమిటీ సభ్యులతో పాటు ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. బస్తరేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పీ సుందర్రాజ్ మాట్లాడుతూ మావోయిస్టులు
తాము అనుసరిస్తున్న మార్గం వ్యర్థమని భావించి వారి జీవితాలను పునర్నిర్మించుకునేందుకు జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని ఎంచుకున్నారన్నారు.

Read also: Today Gold Rate 27/10/25 : బంగారం రేట్లు క్షీణించాయి ఇప్పుడు కొనాలా, ఆగాలా?

Maoist: మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు ఆయుధాలు అప్పగింత

ఆయుధాలను విడిచిపెట్టిన 21 మందిలో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారన్నారు. వారంతా సాయుధ పోరాటాన్ని వీడి శాంతి, పురోగతి మార్గంలో వెళ్లాలనుకుంటున్నారని పోలీస్ అధికారి పేర్కొన్నారు. లొంగుబాటు సమయంలో మావోయిస్టులు 18 ఆయుధాలను అప్పగించారు. ఇందులో మూడు ఎకె 47 రైఫిల్స్, నాలుగు ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఆరు 303 రైఫిల్స్, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్,, ఓ బిజిఎల్ (బారెల్ గ్రెనేడ్ లాంచర్) ఉన్నాయి. చట్టప్రకారం పునరావసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. లొంగుబాటు, పునరావాసానికి సంబంధించిన వివరాలన్నీ త్వరలోనే వివరిస్తామని ఐజీ సుందర్రాజ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల పెద్ద సంఖ్యలో మావోయిస్టులు (Maoist) అడవి మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. అక్టోబర్ మూడో వారంలో దాదాపు 238 మంది మావోయిస్టులు లొంగిపోచారు. 17న బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయం జగదల్పూర్లో అధికారుల ముందు లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడితో సహా దాదాపు 210 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. రూ.9.18 కోట్ల రివార్డును ప్రకటించారు. లొంగిపోయిన సీనియర్ నేతల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ సతీశ్, భాస్కర్ అలియాస్ రాజ్మన్ మాండవి, రాణిత, రాజు సలాం, ధన్ను వెట్టి, అలియాస్ సంతు, నలుగురు సభ్యులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, ప్రాంతీయ కమిటీ సభ్యుడు రతన్ ఎలామ్ ఉన్నారు.

తాజాగా ఎక్కడ మావోయిస్టులు లొంగిపోయారు?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్‌లో మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

లొంగిపోయిన మావోయిస్టులలో ఎవరెవరు ఉన్నారు?
కేశ్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్‌తో పాటు నలుగురు డివిసిఎంలు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు, ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారు.

Bastar news Chhattisgarh police latest news Maoist Surrender Naxal issue Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.