📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Latest Telugu News : Manish Tewari : ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదు :మనీశ్‌ తివారీ

Author Icon By Sudha
Updated: December 9, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నికల సంస్కరణల పై మంగళవారం లోక్‌సభ లో వాడీవేడి చర్చ జరుగుతున్నది. ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగానే ఓటర్ల జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పై చర్చిస్తున్నారు. ఈ చర్చలో ఎంపీ మనీశ్‌ తివారీ (MP Manish Tewari) నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై ఎదురుదాడికి దిగింది. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదని మనీశ్‌ తివారీ (MP Manish Tewari) వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరి, చట్టబద్ధమైన అధికారాలపై మనీశ్‌ తివారీ ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నదా..? అనే విషయంలో చాలామంది సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతుండటం దురదృష్టకరమని అన్నారు.

Read Also: http://CSIR UGC NET: ఈనెల 18 నుంచి సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ రాత పరీక్ష..

Manish Tewari

ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ముందుగా సవరించాల్సినది ఎన్నికల సంఘం సభ్యులను ఎన్నుకునే విధానాన్నేనని మనీశ్‌ తివారీ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు ఎన్నికల కమిషనర్‌లతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా చోటు కల్పిస్తే బాగుంటుందనేది తన సూచన అని చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మనీశ్‌ తివారీతోపాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, మరో సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌, వర్ష గైక్వాడ్, మహ్మద్‌ జావేద్‌, ఉజ్వల్‌ రమణ్‌సింగ్‌, ఇషా ఖాన్‌, మల్లు రవి, ఇమ్రాన్‌ మసూద్‌, గొవాల్‌ పడవి, ఎస్‌ జ్యోతిమని పాల్గొననున్నట్లు పార్టీ తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Congress leader Election Commission Electoral Reforms Indian Politics latest news Manish Tewari Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.