📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Telugu News: Manipur-అల్లర్ల తర్వాత మొదటిసారిగా మోదీ మణిపూర్ పర్యటన

Author Icon By Pooja
Updated: September 12, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Manipur-ఎన్నాళ్లకు ..ఎన్నాళ్లకు ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 13 అనగా రేపు మోదీ మణిపూర్ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. 2023లో మణిపూర్ లో ఎన్నడూ కనివిని ఎరుగునంతగా హింస జరిగింది. మైతీలు, కూకీలు, నాగాల జాతులు ఒకరిపై ఒకరు విధ్వంసాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగక ఒకరిపై ఒకరు హత్యలు, మానభంగాలకు పాల్పడ్డారు. ఇళ్లను ధ్వంస చేశారు. చర్చిలను తగులబెట్టారు. దీంతో కూకీలు, నాగాలు తమ నివాసస్థలాలను వదిలేసి, కొండల్లోకి, అడవుల్లోకి పరుగులు తీశారు. ఇద్దరు మహిళలను దాదాపు 150మంది పురుషులు వివస్త్రలుగా చేసి, రోడ్లపై ఊరేగించారు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచనంగా మారింది. ఇంత విధ్వంసం జరుగుతున్నా ఇంతవరకు దేశ ప్రధాని కాని, రాష్ర్ట పతికాని ఆ రాష్ట్రాన్ని దర్శించి, ప్రజలను ఓదార్చలేదు.

విపక్షాలు విమర్శిస్తున్నా పట్టించుకోని కేంద్రం

మణిపూర్లో 2023 మేనెలలో ప్రారంభమైన అల్లర్లలో 260 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో రాష్ర్ట పతి పాలన కొనసాగుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం మోదీని టార్గెట్ చేస్తూ పలుమార్లు విమర్శిస్తూ వచ్చింది. మోదీ ప్రపంచదేశాలన్ని చుట్టుకుని వస్తారు కానీ మణిపూర్ ను మాత్రం ఇంతవరకు సందర్శించి, ఆ రాష్ట్ర ప్రజలను ఓదార్చలేదని విమర్శించింది. మణిపూర్ దేశంలో ఒక భాగమేనని రాహుల్గాంధీ (Rahul Gandhi )పార్లమెంటులో మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. అయినా కూడా ఎన్టీఏ ప్రభుత్వం ప్రతిపక్షాల వాదనలను లెక్కచేయలేదు. ఎట్టకేలకు రేపు మోదీ మణిపూర్ ను అల్లర్ల తర్వాత మొదటిసారిగా పర్యటిస్తున్నారు. చురచందూర్లో మధ్యాహ్నం 7,500 ఓట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

జాతి హింసగా మారిన ఆనాటి ఉదంతం

మణిపూర్లో జరిగిన అల్లర్లలో 260 మందికి పైగా మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. నేటికీ అనేకులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీప్ క్యాంప్లలో(relief camps) జీవిస్తున్నారు. హింస పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టింది. ఇటీవల ఈ కాలాన్ని మరో ఆరునెలలకు పొడిగించింది. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కారణంగా సాధారణ పాలన సాధ్యం కావడం లేదని కేంద్రం అంటోంది. ఇక్కడ ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్తో సమావేశమై కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నారు.

మణిపూర్‌కు మోదీ ఎందుకు వెళ్తున్నారు?
అల్లర్ల తర్వాత పరిస్థితులను సమీక్షించడానికి, పునరావాసం మరియు శాంతి చర్చలపై దృష్టి పెట్టడానికి.

ఈ పర్యటనలో ప్రధానంగా ఏ అంశాలు చర్చలోకి వస్తాయి?
భద్రతా పరిస్థితులు, శాంతి పునరుద్ధరణ, బాధితుల పునరావాస చర్యలు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

Telugu News: BB season 9-బిగ్ బాస్ లో రచ్చ రచ్చ ఇంతకీ హరీష్ ఏం అన్నాడంటే?

Google News in Telugu Latest News in Telugu Manipur rehabilitation Manipur security situation Manipur violence Modi Manipur tour Narendra Modi Manipur visit Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.