Manipur MLA Vungzagin Valte: మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి

Read Time:  1 min
Manipur MLA Vungzagin Valte: మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి
FONT SIZE
GET APP

Manipur MLA Vungzagin Valte: మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు వంగ్‌జాగిన్ వాల్టే (61) కన్నుమూశారు. థాన్లాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2023లో రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో జరిగిన అమానుష దాడిలో తీవ్రంగా గాయపడి.. గత వెయ్యి రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఉంగ్‌జాగిన్ వాల్తే శనివారం తుది శ్వాస విడిచారు. వాల్టే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Read Also: Jaish-e-Mohammed: పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

Manipur MLA Vungzagin Valte: మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి
Manipur MLA Vungzagin Valte: Manipur BJP MLA passes away

అసలు ఆరోజు ఏం జరిగిందంటే..?

మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైన తొలి రోజుల్లో అంటే 2023 మే 4వ తేదీన ఈ ఘోరం జరిగింది. అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వాల్తే.. నాటి ముఖ్యమంత్రిని కలిసి తిరిగి వస్తుండగా ఇంఫాల్ వీధుల్లో నిరసనకారులు ఆయనపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. జోమీ తెగకు చెందిన వాల్తేను.. అరంబాయ్ టెంగ్గోల్ గ్రూపు సభ్యులు కిరాతకంగా కొట్టారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ఆయన తలకి బలమైన గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి ఆయన పక్షవాతంతో చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.