Manipur CM Meet: మణిపూర్ సిఎంతో శ్రీనివాస వర్మ భేటీ..

Read Time:  1 min
Manipur CM Meet: మణిపూర్ సిఎంతో శ్రీనివాస వర్మ భేటీ..
FONT SIZE
GET APP

Manipur CM Meet: ఈశాన్య రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదేశాల మేరకు, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్వోత్తర్ సంపర్క్ సేతు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మూడు రోజుల మణిపూర్ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించడంతో పాటు ప్రభుత్వ అధికారులతో కీలక సమీక్షా సమావేశాలు వేశాలు నిర్వహించనున్నారు.

Read Also: CM Chandrababu: శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

Manipur CM Meet: మణిపూర్ సిఎంతో శ్రీనివాస వర్మ భేటీ..
Manipur CM: Meet Srinivasa Verma meets Manipur CM..

సీఎం తో సమీక్ష

ఇంఫాల్ చేరుకున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు స్థానిక నాయకులు, అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మణిపూర్ సీఎంతో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఇరువురు సమీక్షించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో ఈశాన్య ప్రాంత (అష్టలక్ష్మి) సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అన్నారు. ఇక్కడి అపారమైన సహజ వనరులను సద్వినియోగం చేసుకుని, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి అని పేర్కొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.