నమ్మిన వాళ్లనే కడతేర్చుతున్నారు చాలా మంది. కొన్ని సందర్భాల్లో చంపాలనుకున్న వాళ్లను.. పక్కా ప్రణాళిక ప్రకారం పిలిపించి మరీ హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. ప్రియురాలిని ఇంటికి పిలిచి మరీ హత్య(Crime) చేశాడో వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటి వెనుక పెరట్లో పాతిపెట్టాడు. అదే సమాధిపై రెండు రాత్రులు నిద్ర చేశాడు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నివారి జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2న జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం సృష్టించింది.
B.R.Gavai:జస్టిస్ బీ.ఆర్. గవాయ్ భద్రతా ఘటనపై వెంకయ్యనాయుడు ఆందోళన
ప్రియురాలిపై.. దాడి చేసి చంపేశాడు
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నిందితుడు రతిరాం రాజ్‌పుత్.. వివాహిత అయిన తన ప్రియురాలిని అక్టోబర్ 2న ఇంటికి పిలిచాడు. ఆరోజు రాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ప్రియురాలిపై.. దాడి చేసి చంపేశాడు రతిరాం. అనంతరం తన స్నేహితులు కాళీచరణ్, ముఖేష్, జ్ఞాన్ సింగ్ సహాయంతో.. తన ఇంటి వెనుక ఉన్న స్థలలో గొయ్యి తవ్వి, ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు (Crime). తర్వాత ఆ సమాధిని మట్టి, ఆవు పేడతో కప్పేశారు. దానిపై మంచం వేసి.. ఎవరికీ అనుమానం రాకుండా రెండు రాత్రులు అక్కడే పడుకున్నాడు. మరోవైపు, ఆ వివాహిత ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు రతిరాంపై అనుమానం వచ్చి అక్టోబర్ 4న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా.. నిందితుడు తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.
పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న నిందితుడి
నిందితుడు చెప్పిన వివరాలతో ఆ మహిళ మృతదేహాన్ని వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్ట్ చేసిన మరుసటి రోజే రతిరాం పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. నిందితుడి కస్టడీలో పెట్టుకుని నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు.
రతిరామ్‌ను బాధితురాలు వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిందని.. అందుకోసం తన భర్తను సైతం విడిచిపెట్టడానికి సిద్ధమైందని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు ఆమెతో సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదని.. అందుకే ప్రియురాలిని చంపేయాలని ప్లాన్ వేశాడని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: https://epaper.vaartha.com/
Read Also: