MamataBanerjee: ‘ఇండియా’ కూటమిపై మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

Read Time:  1 min
MamataBanerjee
MamataBanerjee
FONT SIZE
GET APP

MamataBanerjee: ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే ప్రధాన నాయకురాలని, ఆమె లేకపోతే కూటమి ఉనికే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమి నాయకత్వ బాధ్యతలను ప్రాంతీయ పార్టీల నేతలకు అప్పగించాలని రాహుల్ గాంధీకి సూచించారు.

Read Also:Air Strikes: అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

MamataBanerjee
MamataBanerjee: Mani Shankar Aiyar’s sensational comments on the ‘India’ alliance

గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్‌ను ప్రశంసించడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆయన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అయ్యర్, ‘ఇండియా’ కూటమి విజయానికి మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి ప్రాంతీయ నేతలు కూటమిని నడిపించే సామర్థ్యం కలిగినవారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయ్యర్ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుమన్ రాయ్ చౌదరి మాట్లాడుతూ, అయ్యర్‌కు పార్టీ కార్యకలాపాలతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అలాగే, ఆయన వ్యాఖ్యల వెనుక రాజ్యసభ సీటు ఆశ ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు, టీఎంసీ నేత కునాల్ ఘోష్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ దృష్టి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఉందని, అయ్యర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు సమయం లేదని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.