పశ్చిమబెంగాల్ లో ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పని ఒత్తిడిని తట్టుకోలేక మరో అధికారిణి ఆత్మహత్యకు పాల్పడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) స్పందించారు. ‘ఇంకెంత మంది ఎన్నికల అధికారులు చనిపోవాలి..’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.నదియా జిల్లా శాస్తితలాలోని కృష్ణనగర్‌లో ఎస్‌ఐఆర్ పని ఒత్తిడిని తట్టుకోలేక రింకు తరఫ్‌దార్ అనే మహిళా అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు రెండు పేజీల సూసైడ్ నోట్ కూడా రాశారు. గత బుధవారం కూడా ఇదే కారణంతో మరో మహిళా అధికారిణి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమతాబెనర్జి స్పందించారు.
Read Also: Puttaparthi: సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
ఒక పద్ధతి అనేది లేకుండా రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం అధికారులపై పనిభారం పెంచుతోందని మమతాబెనర్జి (Mamata Banerjee) మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రయత్నాన్ని మానుకోకపోతే మరింత మంది అధికారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
మమతా బెనర్జీ జీవిత చరిత్ర?
“దీదీ” అని ప్రసిద్ధి చెందిన మమతా బెనర్జీ (జననం 5 జనవరి 1955), ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె 20 మే 2011న భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె ఆ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి.
మమతా బెనర్జీ విద్య రుణం?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దార్శనిక నాయకత్వంలో, ఈ చొరవ విద్యార్థులు ఆర్థిక భారాలు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. 4% వడ్డీకి ₹10 లక్షల వరకు రుణం. చదువు సమయంలో సకాలంలో చెల్లింపుపై 1% వడ్డీ రాయితీ. భారతదేశం & విదేశాలలో చదువులకు వర్తిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: