📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Mamata banerjee comments: మోదీయే అతిపెద్ద చొరబాటుదారు:బెనర్జీ సంచలన కౌంటర్!

Author Icon By Pooja
Updated: March 21, 2026 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mamata banerjee comments: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అక్రమ వలసల అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే బలంగా కౌంటర్ ఇచ్చారు. కోల్‌కతాలో నిర్వహించిన ఈద్ వేడుకల్లో పాల్గొన్న ఆమె, బీజేపీ నేతలే అసలైన చొరబాటుదారులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసేవారిని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు.

Read Also:Indian PM: ఇరాన్ అధ్యక్షుడికి పండుగల శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Mamata banerjee comments: ప్రధాని మోదీ టార్గెట్‌గా దీదీ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వమే దేశంలో అతిపెద్ద చొరబాటుదారులని మమతా బెనర్జీ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా వలసల అంశాన్ని రాజకీయం చేస్తూ బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, దీనిని తాము సహించబోమని ఆమె స్పష్టం చేశారు.

ప్రజల హక్కుల కోసం పోరాటం

ఇప్పటికే ఎస్ఐఆర్ (SIR) అంశంపై కేంద్రంపై యుద్ధం ప్రకటిన మమత, బీజేపీ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజల ప్రాథమిక హక్కులను లాక్కోవడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బెంగాల్ గడ్డపై ఎవరి హక్కులకూ భంగం కలగనివ్వబోనని, మైనారిటీల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Biggest infiltrators in India news BJP vs TMC Bengal politics 2026 Illegal immigrants issue Bengal elections Mamata banerjee comments Mamata Banerjee Eid event speech Kolkata Mamata Banerjee on citizen rights Mamata Banerjee slams PM Modi West Bengal election campaign updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.