Mamata banerjee comments: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అక్రమ వలసల అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే బలంగా కౌంటర్ ఇచ్చారు. కోల్‌కతాలో నిర్వహించిన ఈద్ వేడుకల్లో పాల్గొన్న ఆమె, బీజేపీ నేతలే అసలైన చొరబాటుదారులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసేవారిని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు.
Read Also:Indian PM: ఇరాన్ అధ్యక్షుడికి పండుగల శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Mamata banerjee comments: ప్రధాని మోదీ టార్గెట్‌గా దీదీ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వమే దేశంలో అతిపెద్ద చొరబాటుదారులని మమతా బెనర్జీ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా వలసల అంశాన్ని రాజకీయం చేస్తూ బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, దీనిని తాము సహించబోమని ఆమె స్పష్టం చేశారు.
ప్రజల హక్కుల కోసం పోరాటం
ఇప్పటికే ఎస్ఐఆర్ (SIR) అంశంపై కేంద్రంపై యుద్ధం ప్రకటిన మమత, బీజేపీ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజల ప్రాథమిక హక్కులను లాక్కోవడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బెంగాల్ గడ్డపై ఎవరి హక్కులకూ భంగం కలగనివ్వబోనని, మైనారిటీల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: