తెలంగాణ మాజీ మంత్రి, చామకూర మల్లారెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పర్యటించడం రాజకీయంగా, సామాజికంగా ఆసక్తిని(Malla Reddy) రేకెత్తించింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలిలోని చారిత్రక బొబ్బిలి కోటను సందర్శించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనతో ఆయన భేటీ కావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇద్దరూ కలిసి కోటలో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించి, బొబ్బిలి రాజుల వంశవృక్షం, వారు ఉపయోగించిన విలువైన వస్తువులను పరిశీలించారు. బొబ్బిలి రాజుల చరిత్ర ఎంతో గొప్పదని, సుమారు రెండు శతాబ్దాల క్రితం నాటి చారిత్రక వస్తువులను ఎంతో జాగ్రత్తగా భద్రపరచడం అభినందనీయమని మల్లారెడ్డి ప్రశంసించారు. బొబ్బిలి యుద్ధానికి సంబంధించిన అంశాలు, అప్పటి వీరుల త్యాగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి వీరుడు తాండ్రపాపారాయుడు ఉపయోగించిన కత్తిని చేతబట్టి ఫొటోలకు ఫోజులివ్వడం విశేషంగా నిలిచింది. కోటకు సంబంధించిన చారిత్రక విశేషాలను వివరించిన ఎమ్మెల్యే బేబినాయనకు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Read also: TTD: టీటీడీకి రూ.38 లక్షల విరాళం ఇచ్చిన ఇండియన్ బ్యాంక్
బొబ్బిలి పర్యటన వెనుక విద్యారంగ విస్తరణ యోచనలు
విద్యాసంస్థల విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం. (Malla Reddy) బొబ్బిలిలోని ఓ విద్యాసంస్థ ప్రాంగణంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న స్థానిక యాజమాన్యం విన్నపం మేరకే మల్లారెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు డీమ్డ్ యూనివర్సిటీలు, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను నిర్వహిస్తున్న ఆయన, ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యారంగాన్ని విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నం, తిరుపతిలో కొన్ని కాలేజీలను కొనుగోలు చేసినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే ప్రారంభమైంది. 2014లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలుపొందిన ఆయన, తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఆయన విద్యారంగంపై దృష్టి సారిస్తూ కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ఈ పర్యటన సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: