ఫిబ్రవరి 1వ తేదీ వచ్చిందంటే చాలు.. దేశమంతా టీవీల ముందు అతుక్కుపోతుంది. మన జేబుపై పడే భారం ఎంత? వచ్చే ఆదాయంలో మిగిలేది ఎంత? అని ప్రతి సామాన్యుడు ఆత్రుతగా ఎదురుచూసే సమయం వచ్చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, Budget 2026(Budge 2026) కు ముందు గత ఐదేళ్లలో ఆమె తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఏంటో తెలుసుకుందాం.
Read Also: Awards 2026: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి పద్మ భూషణ్ పురస్కారం
సామాన్యుడి చేతిలో ఎక్కువ డబ్బు
జీతగాళ్లకు భారీ ఊరట: 12.75 లక్షల వరకు నో ట్యాక్స్! గత ఐదేళ్లలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత సంతోషాన్నిచ్చిన అంశం పన్ను పరిమితి పెంపు. 2025 బడ్జెట్‌లో నిర్మలమ్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ఉద్యోగులకు ఏడాదికి రూ. 12.75 లక్షల వరకు (స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000తో కలిపి) ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. అంతకుముందు 2023లో ఈ పరిమితి రూ. 7.5 లక్షలుగా ఉండేది. అంటే అతి తక్కువ కాలంలోనే పన్ను రహిత ఆదాయ పరిమితిని భారీగా పెంచి ఉండేలా చేశారు.
‘న్యూ ట్యాక్స్ రెజీమ్’ను
కొత్త పన్ను విధానం ఇక ‘డిఫాల్ట్’ మొదట్లో 2020లో ‘న్యూ ట్యాక్స్ రెజీమ్’ను ఒక ఆప్షన్‌గా మాత్రమే ప్రవేశపెట్టారు. కానీ 2023 బడ్జెట్ నుండి దీనిని డిఫాల్ట్ విధానంగా మార్చారు. అంటే మీరు ప్రత్యేకంగా పాత విధానం కావాలని కోరుకోకపోతే, ఆటోమేటిక్‌గా కొత్త విధానం కిందకే వస్తారు. పన్ను స్లాబులను తగ్గించి, పేపర్ వర్క్ లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభతరం చేయడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో పెను మార్పులు కేవలం జీతగాళ్లకే కాదు, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు కూడా 2024 బడ్జెట్ షాక్ ఇచ్చింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG)ను 15% నుండి 20%కి పెంచారు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నును 12.5% కి ఏకీకృతం చేశారు. రియల్ ఎస్టేట్ విషయంలో ‘ఇండెక్సేషన్’ ప్రయోజనాన్ని తొలగించడం పెద్ద చర్చకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: