📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Fire accident-కార్గో షిప్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కలిసిపోయిన సరుకులు

Author Icon By Pooja
Updated: September 22, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్ పోర్బందర్ సుభాష్ నగర్ జెట్టీ వద్ద సోమాలియాకు బయలుదేరాల్సిన ఓ కార్గో షిప్ లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నౌకలో ఉన్న బియ్యం, చక్కెర సరకులకు మంటలు అంటుకోవడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. జామ్నగర్ కు చెందిన ‘హరిదర్శన్’ అనే ఈ కార్గో నౌక సుమూరు 950 టన్నుల బియ్యం, 78 టన్నుల చక్కెరతో సోమాలియాలోని బొసాసోకు వెళ్లాల్సి ఉంది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిప్రమాద సిబ్బంది మూడు ఫైరింజన్లతో(Fire engines) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, నౌకలో చక్కెర, ఇతర సరకుల కారణంగా మంటలు భారీగా వ్యాపించాయి. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు, సమీపంలోని ఇతర నౌకలు, జెట్టీకు మంటలు అంటుకోకుండా ఉండేందుకు అధికారులు ఆ నౌకను జెట్టి నుంచి సముద్రంలోకి మధ్యలోకి లాగారు. సురక్షితంగా బయటపడ్డ సిబ్బంది

ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న 14మంది సిబ్బందిని సురక్షితంగా(Safely) రక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నౌక యజమాని జామ్నగర్ కు చెందిన హెచ్ఆర్ఎం అండ్ సన్స్ సంస్థకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. ఈ మంటలకు సంబంధించిన వీడియోలు సోషలహీ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అగ్నిప్రమాదం ఎక్కడ జరిగింది?
ఒక కార్గో షిప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

అగ్నిప్రమాదంలో ఏం నష్టం జరిగింది?
నౌకలో ఉన్న సరుకులు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/good-news-for-railway-passengers-4/business/552143/

Cargo Ship Fire fire accident Google News in Telugu Latest News in Telugu sea accident Ship Fire News Shipping Accident Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.