📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest Telugu news : Maithili Thakur : నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నాను .. సింగర్ మైథిలీ ఠాకూర్‌

Author Icon By Sudha
Updated: October 7, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాను రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నానని ఫోక్‌ సింగర్‌ మైథిలీ ఠాకూర్‌ (Maithili Thakur)అన్నారు. తాజా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె మాట్లాడారు. మరో నెల రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మైథిలీ ఠాకూర్‌ తాజాగా తన తండ్రితో కలిసి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వినోద్‌ తావ్డే, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌లను కలిశారు. దాంతో మైథిలీ ఠాకూర్‌ (Maithili Thakur)రాజకీయాల్లోకి వస్తున్నారని, బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈ విషయంపై ప్రశ్నించగా ప్రజలకు సేవ చేసేందుకు ఆ అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని చెప్పారు. మైథిలీ ఠాకూర్‌ అంశంపై వినోద్‌ తావ్డే కూడా సోషల్‌ మీడియాలో స్పందించారు. మైథిలీ ఠాకూర్‌ (Maithili Thakur)ను ‘బీహార్‌ మానస పుత్రిక’ గా అభివర్ణించారు. 1995లో లాలూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీహార్‌ను విడిచిపెట్టి వెళ్లిన కుటుంబాలు తిరిగి వస్తున్నాయని, అలాంటి ఓ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డనే మైథిలీ ఠాకూర్‌ అని పేర్కొన్నారు.

Maithili Thakur : నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నాను .. సింగర్ మైథిలీ ఠాకూర్‌

మైథిలీ ఠాకూర్‌ బీహారీలకు తన సేవలు అందిస్తారని, ఇక్కడి ప్రజల ఆశయాలను నెరవేరుస్తారని తావ్డే రాసుకొచ్చారు. అయితే తావ్డే స్పందనపై మైథిలీ ఠాకూర్‌ ఆనందం వ్యక్తంచేశారు. తావ్డే తనను అభినందించడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. ముందుగా తనకు రాజకీయాలంటే ఇష్టం ఉండేది కాదని, ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకున్న తర్వాత రాజకీయాలపై ఇష్టం పెరిగిందని చెప్పారు. ‘మధుబని నుంచి పోటీ చేస్తారా.. దర్బంగా నుంచి పోటీ చేస్తారా..?’ తన తల్లిది మధుబని, తండ్రిది దర్భంగా అని.. రెండూ తనకు ఇష్టమేనని, అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.

మైథిలి ఠాకూర్ ఎవరు?

ఠాకూర్ బీహార్‌లోని మధుబని జిల్లాలోని బేనిపట్టిలో ఢిల్లీలో పనిచేస్తున్న మైథిల్ సంగీతకారుడు మరియు సంగీత ఉపాధ్యాయుడు రమేష్ ఠాకూర్ మరియు భారతీ ఠాకూర్‌లకు జన్మించారు . ఆమెకు సీతాదేవి పేరును ఆమె మాతృభాషతో పాటు పెట్టారు . మైథిలి, ఆమె ఇద్దరు సోదరులు, రిషవ్ మరియు అయాచిలతో కలిసి వారి తాత మరియు తండ్రి వద్ద మైథిలి జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం , హార్మోనియం మరియు తబలాలో శిక్షణ పొందారు.

మైథిలి ఠాకూర్ సంగీత వృత్తి?

మైథిలి ఠాకూర్ (జననం 25 జూలై 2000) భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు జానపద సంగీతంలో శిక్షణ పొందిన భారతీయ నేపథ్య గాయని . ఆమె హిందీ , బెంగాలీ , మైథిలి , ఉర్దూ , మరాఠీ , భోజ్‌పురి , పంజాబీ , తమిళం , ఇంగ్లీష్ మరియు మరిన్ని భారతీయ భాషలలో ఒరిజినల్ పాటలు, కవర్ పాటలు మరియు సాంప్రదాయ జానపద సంగీతాన్ని ప్రముఖంగా పాడింది

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bihar talent Breaking News latest news Maithili Thakur regional pride serving the community singer Maithili Thakur Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.