మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ జనవరి 28న బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. (Maharashtra) తాజాగా ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ మృతికి తెరవెనుక కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.
Read Also: Indian Railways: SC జోన్ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం
అజిత్ పవార్ (Ajit Pawar) ప్రమాదంపై ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అన్నారు. ఈ ప్రశ్నలు ఆయన సొంత పార్టీలో కూడా తలెత్తుతున్నాయని చెప్పారు. (Maharashtra) అజిత్ పవార్ మరణం వెనుక ఏదో అనుమానాస్పదంగా జరిగిందని.. అనుమానాలు వ్యక్తం చేశారు. “అజిత్ పవార్ ఎన్‌సీపీ రెండు వర్గాలను మళ్లీ కలపడానికి సిద్ధమవుతున్నారు.
కానీ బీజేపీ తమ వద్ద నీటిపారుదల కుంభకోణానికి (సించన్ స్కామ్) సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని ఒత్తిడి తెచ్చింది. దానికి అవే ఫైళ్లు తమ వద్ద కూడా ఉన్నాయని అజిత్ పవార్ తిప్పికొట్టారు. ఇది జరిగిన 10 రోజుల్లోపే అజిత్ పవార్ అనుమానాస్పద పరిస్థితుల్లో విమాన ప్రమాదం జరిగి మృతి చెందారు. ఈ ఘటనపై మొదటి రోజు నుంచే నాకు అనుమానాలు ఉన్నాయి. అంటే అజిత్ పవార్ ఎన్‌డీఏ నుంచి బయటకు రావాలని అనుకున్నట్లు స్పష్టమవుతోంది. నేను ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాను” అని సంజయ్ రౌత్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: