📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Maharashtra: వైద్యకళాశాలలో ర్యాగింగ్.. నమాజ్ చేయమని బలవంతం

Author Icon By Anusha
Updated: January 7, 2026 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనదేశం భిన్నత్వంలో ఏకత్వం. మతాలు, భాషలు ఎన్ని ఉన్నా అందరం సమానమే. అందరికీ సమాన హక్కులే ఉన్నాయి. మతం ఏదైనా మానవత్వాన్ని, మంచిని పంచిపెడుతుంది. ఎదుటివారి క్షేమాన్ని కోరేది మతం. హింసను, వివక్షను చూపించేది మతం కాదు అది ఓ ఉన్మాదమే. తాజాగా ఓ విద్యార్థిని నమాజ్ చేయమని బలవంతం చేయడంతో ఈ విషయం కాస్త బయటికొచ్చి, వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: Hydrogen Train: భారత్‌లో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

మహారాష్ట్ర (Maharashtra) లోని పాల్హర్ జిల్లాలోని వాడా తాలూకాలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్ లో ర్యాగింగ్ కేసు నమోదైంది. ఒక అమ్మాయి తోటి విద్యార్థిని నమాజ్ చేయమని బలవంతం చేసింది. ఈ ఘటన తర్వాత, ఇన్స్టిట్యూట్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్, టీచర్ ను సస్పెండ్ చేసింది. ఆదివారం రాత్రి పోషేరీలోని కళాశాలలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం, వైద్య కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు నిరసనలకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

Maharashtra: Ragging in medical college.. Forced to pray Namaz

ర్యాగింగ్ జరిగి ఉండవచ్చు!

ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన ర్యాగింగ్ తో ముడిపడి ఉండవచ్చని తెలుస్తుందని ఒక అధికారి తెలిపారు. నాసిక్ కు చెందిన మొదటి సంవత్సరం ఫిజియోథెరపీ
విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం, బురఖా ధరించిన ఓ యువతి హాస్టల్ లోని మరో విద్యార్థినిని నమాజ్ చేయమని ఒత్తిడి చేసినట్లు తెలిపారు. బాధితురాలు మరుసటి రోజు ఉదయం తన కుటుంబానికి సమాచారం అందించిందని పోలీసు అధికారి తెలిపారు.

కళాశాల యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె విశ్వహిందూ పరిషత్ ను సంప్రదించిందన్నారు.పాల్టర్ పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ ముఖ్ క్యాంపస్ ను సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), మహారాష్ట్ర ర్యాగింగ్ నిషేధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మేం కేసు నమోదు చేశామని తెలిపారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు, సూపరింటెండెంట్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.