📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Maharashtra Govt: వరద నష్ట రైతులకి 6 రూపాయల పరిహారం

Author Icon By Anusha
Updated: November 6, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర (Maharashtra Govt) లో వరదలు, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం పేరుతో ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తాన్ని చూసి అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పైఠాన్ తాలూకాలోని దావర్‌వాడి గ్రామానికి చెందిన రైతు దిగంబర్ సుధాకర్ తాంగ్డే (Digambar Sudhakar Tangde) కు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కేవలం రూ.6 మాత్రమే కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Read Also: Bihar Elections 2025: ఓటు హక్కును వినియోగించుకున్న లాలు కుటుంబం

గత ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో మరాఠ్వాడా ప్రాంతంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు తీవ్ర పంట నష్టాన్ని చవిచూశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఏకంగా రూ. 31,628 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో పంట నష్టంతో పాటు నేల కోత, ఇళ్లు, పశువుల పాకలు దెబ్బతినడం వంటి నష్టాలకు కూడా పరిహారం ఉంది.

అయితే రైతులకు అందిన మొత్తం ఈ ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరాఠ్వాడా పర్యటనలో భాగంగా పైఠాన్ తాలూకాలోని నందార్ గ్రామంలో రైతులతో సంభాషించిన సందర్భంగా తాంగ్డే ఈ విషయాన్ని వెల్లడించారు. “నాకు కేవలం రెండు ఎకరాల భూమి ఉంది. నా బ్యాంకు ఖాతాలో రూ. 6 జమ అయినట్లు నాకు మెసేజ్ వచ్చింది.

Maharashtra Govt

తాంగ్డే ఆవేదన వ్యక్తం చేశారు

ఇంత తక్కువ చెల్లించడానికి ప్రభుత్వానికి (Maharashtra Govt) సిగ్గుండాలి. ఈ మొత్తం నాకు ఒక కప్పు టీ కొనడానికి కూడా సరిపోదు. ప్రభుత్వం రైతులను పెద్ద జోక్‌ చేస్తోంది” అని తాంగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న తమకు రుణమాఫీ అవసరమని.. ఇలాంటి చిన్న మొత్తాలు పంపి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) రుణమాఫీ చేశారని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి ఏమీ చేయలేదని విమర్శించారు.ఇలాంటి పరిహాసాస్పద పరిహారం తాంగ్డేకు ఒక్కరికే ఎదురు కాలేదు. గతంలో అకోలా జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంట నష్టానికి పరిహారంగా కేవలం రూ. 2.30, రూ. 21 మాత్రమే అందుకున్నారు. ఈ మొత్తాన్ని రైతులు తమ దుస్థితికి అవమానంగా, ఎగతాళిగా పేర్కొన్నారు.

నెలల తరబడి ఎదురుచూసిన తర్వాత

ఈక్రమంలోనే రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి.. అందిన చిన్న మొత్తాలను చెక్కుల రూపంలో వెనక్కి ఇచ్చేశారు. నెలల తరబడి ఎదురుచూసిన తర్వాత.. రైతన్నలకు అందిన ఈ హాస్యాస్పద పరిహారం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను,

పారదర్శకత లేమిని ఎత్తి చూపుతోంది. తక్షణమే పరిహార ప్రక్రియను సమీక్షించి.. రైతులకు సరైన న్యాయం చేయాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

crop loss farmer compensation latest news Maharashtra Floods Paithan taluka Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.