మహారాష్ట్రలో(Maharashtra Elections) జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో, కీలక నగరాల్లో రాజకీయ పార్టీల బలం బయటపడుతోంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 24 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 9 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన 12 స్థానాల్లో ఆధిక్యం చూపుతూ తన ఉనికిని చాటుతోంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్ 6 చోట్ల ముందుండగా, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. ముంబైలో మహాయుతి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముంబైలో మహాయుతి ఆధిక్యం, కొల్హాపూర్‌లో కాంగ్రెస్ పట్టు
ఇక కొల్హాపూర్ నగరంలో మాత్రం(Maharashtra Elections) కాంగ్రెస్ పార్టీ బలంగా నిలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ 17 స్థానాల్లో ముందంజలో ఉండి, స్థానిక రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. బీజేపీ 15 స్థానాల్లో పోటీగా నిలవగా, షిండే శివసేన 7 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఉద్ధవ్ శివసేన 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉండగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే కాలంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త వ్యూహాలకు, కూటముల బలాబలాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: