📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul: రాహుల్‌ గాంధీకి ఎన్నికల కమిషన్‌ అధికారికంగా లేఖ

Author Icon By Sudha
Updated: June 24, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఎన్నికల కమిషన్‌ (Election Commission)అధికారికంగా లేఖ (letter)రాసింది. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలు, రూల్స్‌ (Laws and rules)కు అనుగుణంగానే నియమాలకు అనుగుణంగా అన్ని ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని పేర్కొంది. రాజకీయ పార్టీలు నియమించిన బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో సహా మొత్తం ఎన్నికల ప్రక్రియలో వేలాది మంది పాల్గొంటారని ఎన్నికల కమిషన్‌ గుర్తు చేసింది. ఓ ప్రముఖ దినపత్రికలో రాహుల్‌ గాంధీ రాసిన కథనానికి ప్రతిస్పందన ఎన్నికల కమిషన్‌ లేఖను కాంగ్రెస్‌ నేతకు పంపింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో వికేంద్రీకృత పద్ధతిలో జరుగుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

Rahul: రాహుల్‌ గాంధీకి ఎన్నికల కమిషన్‌ అధికారికంగా లేఖ

లేఖ మాకు రాయొచ్చు
ఎన్నికల్లో 1,00,186 మంది బూత్ స్థాయి అధికారులు (BLOs), 288 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs), 139 మంది జనరల్ అబ్జర్వర్లు, 41 మంది పోలీస్ అబ్జర్వర్లు, 71 మంది ఎక్స్‌పెండేచర్‌ పరిశీలకులు, కమిషన్ నియమించిన 288 మంది రిటర్నింగ్ అధికారులు (ROs) ఉన్నారని.. మహారాష్ట్రలోని 28,421 కాంగ్రెస్ పార్టీలతో సహా జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు 1,08,026 బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) నియమించాయని తెలిపారు. ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి అంశాలను కాంగ్రెస్‌ అభ్యర్థులు సమర్థ కోర్టు (హైకోర్టు)లో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ల ద్వారా లేవనెత్తినట్లుగా విశ్వసిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ‘మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే.. లేఖ మాకు రాయొచ్చని.. అన్ని అంశాలను చర్చించేందుకు వ్యక్తిగతంగా కలిసేందుకు కూడా కమిషన్‌ సిద్ధంగా ఉంది’ ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.
సీసీటీవీ ఫుటేజ్‌
మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. ఓట్ల దొంగతనం జరిగిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఆరోపించారు. మెషిని రీడబుల్‌ డిజిటల్‌ ఓటర్‌ రోల్స్‌, అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆరు నెలల్లోనే నాగ్‌పూర్‌ సౌత్‌ వెస్ట్‌ బీజేపీ నేత దేవేంద్ర సింగ్‌ ఫడ్నవీస్‌ నియోజకవర్గంలో కొత్తగా 29,219 మంది కొత్త ఓటర్లు చేశారని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఓటర్లు కేవలం ఐదు నెలల్లోనే 8శాతం పెరిగిందని.. కొన్ని బూత్‌లలో 20-50శాతం పెరుగుదల కనిపించిందని మంగళవారం రాహుల్‌ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు.

Read Also:Ananthkumar Hegde: ముస్లిం కుటుంబంపై దాడి కేసులో కర్ణాటక

#ECIvsRahul #ElectionTransparency #FakeVoters #MahaElections2024 #MatchFixingAllegations Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.