📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Maharashtra Crime: మహారాష్ట్ర మంత్రి పీఏ భార్య ఆత్మహత్య

Author Icon By Sushmitha
Updated: November 24, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర (Maharashtra Crime) బీజేపీ మంత్రి పంకజ ముండే పీఏ అనంత్ గాడ్జే భార్య డాక్టర్ గౌరీ పాల్వే ఆత్మహత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. శనివారం సాయంత్రం ముంబైలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి స్తున్నాయి. గౌరీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంత్ గార్జేతో పాటు అతని కుటుంబంలోని మరో ఇద్దరు సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం అర్థరాత్రి వర్లి పోలీసులు అనంత్ గార్డేను అరెస్టు చేశారు.

Read Also: Telangana: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ఎప్పనుంచి వీక్షించవచ్చంటే

దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు

అనంత్ గార్జ్ విచారణలో గౌరీ ఆత్మహత్య చేసుకునే కొన్ని నిమిషాల ముందు దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. గొడవ అనంతరం పంకజ ముండే కార్యక్రమానికి వెళ్లిపోయారు అనంత్. అనంతరం గౌరీకి పదేపదే ఫోన్ చేసిన ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. అంతలోనే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భర్త అనంత్ గార్జ్ వివాహేతర సంబంధాలే గౌరీ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది తిరగకముందే విషాదం జరగడం తీవ్రంగా కలచివేస్తున్న ఘటన.

పెళ్లికి ముందే అనంత్ కు వివాహేతర సంబంధాలు

అనంత్ గార్డేకు పెళ్లికి ముందే మరో మహిళతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. గౌరీకి భర్త వాట్సాప్ లో (WhatsApp) కొన్ని ఫొటోలు కనిపించాయి. లాతూరులోని ఒక ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. 2021 నాటి ఆ పత్రంలో గర్భధారణ సమ్మతి, డిక్లరేసన్ ఫామ్ ఉండగా, అందులో మహిళ పేరు కిరణ్, భర్త పేరు అనంత్ గార్జ్ అని ఉంది. ఈ పత్రం అనంత్ వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేసింది. దీంతో తండ్రి ఆమెను ఇంటికి రమ్మని అడగ్గా అనంత్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లుగా తెలుస్తోంది. భార్య ఆత్మహత్యకు అనంత్ కు మరో మహిళతో ఉన్న సంబంధమే కారణమని గౌరీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

domestic issues Google News in Telugu Latest News in Telugu Maharashtra Crime Maharashtra minister PA police investigation political scandal Telugu News Today tragic death. wife suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.