స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక బాల్యం, యువత తమ అందమైన జీవితాన్ని కోల్పోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇవేవీ వారికి అందుబాటులో లేనప్పుడు ఎంతో ఆరోగ్యకరంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండేవారు. కానీ మొబైల్ ఫోన్లు (Mobile phones) చేతిలోకి వచ్చాక, వారు మన అధీనంలో ఉండడం లేదు. పొద్దస్తమానం ఫోన్లకే బానిసైపోతున్నారు. తమ కెరీర్ జీవితాన్ని, బాల్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక తనకు సెల్ ఫోన్ (cell phone) కొనివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని (Maharashtra Crime) నాగ్ పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Indias Tejas Fighter Jet: మన తేజస్ ఎంత భద్రం?
తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని కారణంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చంకపూర్ లోని మురికివాడ ప్రాంతంలో ఓ 13 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి ఉంటోంది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఎక్కువగా ఆడి వాటికి బానిస అయిపోయింది.
ఉరేసుకుని ఆత్మహత్య
దీంతో తనకు సొంతంగా మొబైల్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగింది. కానీ వాళ్లు నిరాకరించారు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమె తల్లి, సోదరి ఇంటికి వచ్చాక సీలింగ్ కు వేలాడుతున్న ఆమెను చూసి కంగుతిన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విచారణ చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: