జాతీయవిద్యావిధానం రద్దు చేయడంతోపాటు పాతపెన్షన్ పునరుద్ధరణ రద్దు కోసం స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFA) వచ్చే ఏడాది జవరి 29న ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. టెట్(TET) నుండి ఇన్ సర్వీసు ఉపాద్యాయులని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మహా ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షులు సిఎన్ భార్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. ఎస్టీఎఫ్ఎ కార్యదర్శి వర్గం, కేంద్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో ఢిల్లీ ఫరీదాబాద్ లోని సంఘ కార్యాలయంలో జరిగాయి.
Read also : Tirumala: ఫిబ్రవరి నెల టిక్కెట్లు రేపు ఆన్లైన్లో విడుదల
ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ
సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర పాలకులు కార్పొరేటీకరణ వ్యాపారీకరణ విధానాలను అమలు చేస్తూ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తూ.. పేదలను చదువుకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దాంతోపాటు ఆశాస్త్రీయ అంశాలతో రూపొందించిన జాతీయ విద్యావిధానం-2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ బాధ్యత ప్రభుత్వమే చూడాలని, కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను తక్షణ మానుకోవాలని డిమాండ్ చేశారు.
పాతపెన్షన్ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్
2004 నుండి అమలులో ఉన్న నూతన పెన్షన్ విధానం కార్పొరేట్లకు లాభం తప్ప ఉద్యోగ, ఉపాద్యాయులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్ ఉన్న యుపిఎస్, జిపిఎస్, సిపిఎస్(UPS, GPS, CPS) లాంటి స్కీమ్స్ ఎన్టిఎఫ్ఐకి అంగీకారం కాదని తెలిపారు. తక్షణం పాతపెన్షన్ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్సిటిఈ నోటిఫికేషన్ ముందు నియామకమైన ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై కావాలనే సుప్రీంకోర్టు తీర్పు అప్రజాస్వామికమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. దీనిపై కోర్టులో ఎస్ఎఫ్ఐ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని, కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని డిమాండ్ చేశారు.
సీనియర్ ఉపాధ్యాయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఈ నెల 25న ప్రధానమంత్రి కార్యాలయానికి అన్ని జిల్లా యూనిట్స్ నుండి మెమోరాండంలు, మెయిల్ చేయాలని, నెలాఖరులోగా అధికార, ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరినీ కలిసి టెట్ మినహాయింపు అంశాన్ని పార్లమెంటులో చర్చించాలని కోరతామన్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, జనవరి 5న రాష్ట్ర కేంద్రాల్లో ధర్నాలు చేయాలని సమావేశాల్లో నిర్ణయించినట్టు తెలిపారు.
త్వరలోనే జాతీయ స్థాయిలో ఇతర ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి టెట్పై ఐక్య కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కులన్నీ మహిళా హక్కులే అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని నిర్వహించాలని, సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని జనవరి3ను జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్టు నాయకులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :