మనదేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో విలువ ఉంది. అంతేకాదు మన కుటుంబ వ్యవస్థ కూడా ఎంతో గొప్పది. ప్రపంచదేశాలకు మనదేశమే ఆదర్శం. పెళ్లి రెండు మనసుల మధ్యే కాదు రెండు కుటుంబాల మధ్య అనుబంధాలకు వారధి. బలమైన సమాజానికి దేశ ఔన్నత్యానికి కుటుంబమే పునాది. కుటుంబం బాగున్నప్పుడేసమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ నేటి కాలంలో కుటుంబ వ్యవస్థలకు బీట్లు వారుతున్నాయి. క్షణికమైన సుఖం కోసం అడ్డదారులు తొక్కుతూ, కుటుంబాలను కాలరాస్తున్నారు. తాజాగా ఓ వివాహిత కట్టుకున్న భర్త తో పాటు ప్రియుడితోను సంబంధాన్ని కొనసాగించింది. చివరికి ఏం చేసిందో మీరే చదవండి..
Read also: Viral Video: కార్ ఢీకొని గాల్లోకి ఎగిరిన బాలుడు
పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని షియోపూర్ జిల్లాలో రమాకాంత్ పాఠక్, ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా.. సాధన శర్మ అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. రమాకాంత్ ఇంటి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంకు ఉంది. రోజూ, సాధన శర్మ ఆ పెట్రోల్ బంకు ఎదురుగానే వెళ్తుండేది. ఈ క్రమంలో పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికుడు మనీష్ జాతవ్ (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఏడాదిన్నర నుంచి ఇద్దరి మధ్య చనువు పెరిగింది. భర్త లేని సమయంలో ఇద్దరూ ఇంట్లో కలుసుకునేవారు. ఒకరోజు భర్త రమాకాంత్ కంట్లో పడ్డారు. దీంతో తీరు మార్చుకోవాలని భర్త హెచ్చరించాడు. అయినా కూడా బుద్ధి మార్చేకోలేదు. ప్రియుడితోనే తిరుగుతోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. దీంతో భర్తను అంతమొందించి, ప్రియుడితో కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్న సాధన అందుకు స్కెచ్ వేసింది.
బయటకు వెళ్తామని నమ్మించి, ఆపై హత్య
సాధన ఇదే విషయాన్ని ప్రియుడు మనీష్ జాతవ్ కు చెప్పింది. దీంతో మనీష్ తన స్నేహితుడు సత్నం సాయం తీసుకున్నాడు. ఒకరోజు మనీస్ రమాకాంత్ పాఠక్, ను బయటకు వెళ్తామని నమ్మించి, మిత్రుడితో కారులో వెళ్లారు. నాన్ పూర్ వ్యాలీ దగ్గరకు తీసుకెళ్లి, అక్కడ రమాకాంత్ ను హతమార్చి, లోయలో పడేశారు. అనంతరం బైక్ న్ తీసుకొచ్చి మృతదేహం దగ్గర పడేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
గత సంవత్సరం డిసెంబర్ 27వ తేదీన పోలీసులు నాన్ పురా, లోయలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించి, దర్యాప్తు చేపట్టారు. భార్య సాధనశర్మను, విచారించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఆమె కాల్ డేటాను పరిశీలించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా సాధన అసలు విషయాన్ని చెప్పింది. నెలన్నర క్రితం ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు తేల్చారు. సాధనతో పాటు మనీష్, సత్నం లను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: