📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Madhya Pradesh: వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి

Author Icon By Tejaswini Y
Updated: December 30, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌(Tiger Reserve)కు సమీపంలో ఉన్న ఒక గ్రామంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడవిని దాటి గ్రామంలోకి ప్రవేశించిన ఓ పులి గ్రామస్థుల్లో భయాందోళన సృష్టించింది. ఒక యువకుడిపై దాడి చేయడమే కాకుండా, ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడి మంచంపై కూర్చోవడంతో గ్రామం అంతా గడగడలాడింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో గ్రామస్థులు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గంటల తరబడి ఆశ్రయం పొందారు.

Read Also: Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి

పాన్‌పథా బఫర్ జోన్ నుంచి బయలుదేరిన పులి

ఉదయం 10 గంటల సమయంలో పాన్‌పథా బఫర్ జోన్ నుంచి బయలుదేరిన పులి మొదట గ్రామ పరిసరాల్లోని పంట పొలాల్లో దర్శనమిచ్చింది. అటవీశాఖ(Forest Department)కు సమాచారం చేరేలోపే మధ్యాహ్నానికి అది గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామస్థులు కర్రలతో పులిని అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నించగా, అకస్మాత్తుగా అది గోపాల్ కోల్ అనే యువకుడిపై దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడి కాలు తీవ్రంగా గాయపడింది. అతడిని తొలుత బర్హీ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కట్నీకి తరలించారు.

Madhya Pradesh Tiger attacks man and rests on bed

దాడి అనంతరం పులి దుర్గా ప్రసాద్ ద్వివేది ఇంట్లోకి వెళ్లి అక్కడి మంచంపై కూర్చుండటంతో భయం మరింత పెరిగింది. సమాచారం అందుకున్న పాన్‌పథా బఫర్ జోన్ రెస్క్యూ బృందం, వెటర్నరీ వైద్యులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టింది. సుమారు ఎనిమిది గంటల పాటు శ్రమించి పులికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకుని, ఆపై సురక్షితంగా అడవిలోకి తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bandhavgarh Tiger Reserve Forest Department Madhya Pradesh tiger attack Village Panic Wildlife Rescue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.