Madhya Pradesh: పరీక్ష రాస్తూ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

Read Time:  1 min
Madhya Pradesh: పరీక్ష రాస్తూ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
FONT SIZE
GET APP

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి బోర్డు పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని, పరీక్షా కేంద్రంలోని వాష్‌రూమ్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ధార్ జిల్లాలోని పిథాంపూర్‌లో మంగళవారం గణితం పేపర్ రాస్తున్న సమయంలో ఈ ప్రసవం జరగడం కలకలం రేపింది.

పిథాంపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఇన్విజిలేటర్ అనుమతితో వాష్‌రూమ్‌కు వెళ్లింది. చాలాసేపటి వరకు ఆమె తిరిగి రాకపోవడం, అదే సమయంలో లోపలి నుండి పసికందు ఏడుపు వినిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెళ్లి చూడగా ఆ మైనర్ విద్యార్థిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా తల్లీబిడ్డలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Read Also: Indian Elections: ఓటు హక్కుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

Madhya Pradesh: పరీక్ష రాస్తూ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
Madhya Pradesh: Student gives birth in washroom while writing exam

పరీక్ష మధ్యలో కడుపునొప్పి.. ఆపై పసికందు ఏడుపు

వెంటనే పరీక్షా కేంద్రం యాజమాన్యం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించింది. తల్లీబిడ్డను హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు ఇండోర్ జిల్లాలోని బెత్మా ప్రాంతానికి చెందినది కావడంతో కేసును అక్కడి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ధార్ ఏఎస్పీ విజయ్ దబూర్ మీడియాకు వెల్లడించారు. విచారణలో భాగంగా గత రెండేళ్లుగా ఓ యువకుడితో పరిచయం ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిపై పోక్సో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.