మధ్యప్రదేశ్‌లో Madhya Pradesh రాహుల్-ప్రియాంక Rahul-Priyanka వ్యాఖ్యల వివాదం: విజయవర్గియా మద్దతు, రాజకీయ ఉద్రిక్తత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతల కుటుంబ సంబంధాలపై విజయవర్గియా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అనుబంధంపై కేంద్రo వ్యాఖ్యలు చేసి, మంత్రివర్గంలోని మరో సభ్యుడు విజయ్ షా కూడా ఆ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచాడు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తత కలిగించింది. ఖాండ్వాలో జరిగిన ఒక కార్యక్రమంలో విజయ్ షా మాట్లాడుతూ, అన్నాచెల్లెల్లు బహిరంగ ప్రదేశంలో ఆప్యాయత చూపడం భారతీయ సంస్కృతికి సౌకర్యవంతం కాదని చెప్పారు. “ఇలాంటి ప్రవర్తన ప్రతి వ్యక్తి ఇళ్లకే పరిమితం చేయాలి, బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించకూడదు” అని ఆయన పేర్కొన్నారు. తన పక్కన ఉన్న ఎమ్మెల్యేను ఉదాహరించి, “ఆమె నా సొంత చెల్లే, అందరి ముందు ముద్దు పెట్టగలనా? మన సంస్కృతి ఇది నేర్పదు” అని వివరించారు.
Supreme Court : చెక్ బౌన్స్ కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Madhya Pradesh
‘ఆపరేషన్ సిందూర్’
విజయ్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించడంతో రాజకీయ ఉద్రిక్తత ఇంకా పెరిగింది. కొందరు నేతలు మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ, ఈ వ్యాఖ్యలు “అసహ్యకరమైనవి” అని, భారత సంస్కృతి, పవిత్రమైన అన్నాచెల్లెల్ల బంధానికి వ్యతిరేకమని చెప్పారు. గతంలోనూ విజయ్ షా Vijay Shah వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నారు. Madhya Pradesh ఈ ఏడాది మే 13న ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు తెలిపినా, ఇప్పుడు విజయవర్గియాకు మద్దతుగా మరో మంత్రి నిలవడం మధ్యప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
మధ్యప్రదేశ్‌లో ఏ రాజకీయ వివాదం ఏర్పడింది?
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అనుబంధంపై మంత్రి కైలాష్ విజయవర్గియా చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వివాదం కలిగింది.
ఇతరులు ఈ వివాదంపై ఏ విధంగా స్పందించారు?
మంత్రివర్గంలోని మరో సభ్యుడు విజయ్ షా విజయవర్గియాకు మద్దతుగా నిలిచాడు, ఆయన కూడా సంస్కృతి పరంగా బహిరంగ ప్రదేశంలో ఆప్యాయత చూపకూడదని వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: