📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Madhya Pradesh: నడిరోడ్డులో మహిళపై బీజేపీ నేత దాడి

Author Icon By Saritha
Updated: February 9, 2026 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీజేపీ నేత ఒక మహిళను దారుణంగా కొట్టాడు. కర్రతో చితకబాదాడు. కాళ్లతో ఆమెను తన్నాడు. ఆ మహిళ వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ(BJP) నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. (Madhya Pradesh) మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సిహావల్‌కు చెందిన బీజేపీ నేత సంతోష్ పాఠక్, హేమా సింగ్ బహ్రీ ఒక మహిళపై దారుణంగా దాడి చేశాడు. ఆమెను కర్రతో కొట్టాడు. కాళ్లతో తన్నాడు. వీపుపై పిడిగుద్దులు కురిపించాడు.

మార్కెట్‌లో చిన్న బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు హేమా సింగ్ బహ్రీ. కొన్ని రోజుల క్రితం రాత్రికి రాత్రే తన బండిని, దుకాణాన్ని సంతోష్ పాఠక్ తొలగించాడని, దీనిపై తాను బహ్రీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మార్కెట్‌లో బండి పెట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. వాగ్వాదం పెరగడంతో సంతోష్ పాఠక్ ఆమెపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న వారిలో ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

Read Also: Budget: ఏఐపై అమెజాన్, మెటా భారీ పెట్టుబడులు

BJP leader attacks woman in the middle of the road.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు

(Madhya Pradesh) బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్‌ కింద వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు నేను బండి పెట్టుకోవడానికి రాగానే సంతోష్ పాఠక్, మరొకరు వచ్చి నన్ను దూషించడం మొదలుపెట్టారు. ఆపమని కోరగా, ఈ ప్రాంతంలో తాను చెప్పిందే నడుస్తుందని బెదిరించాడు. 8-10 ఏళ్లుగా ఇక్కడే బండి నడుపుతున్నానని చెప్పినా వినకుండా కర్రతో కొట్టాడు అని బాధితురాలు పోలీసులకు వివరించారు.

అక్కడున్న వారెవరూ తనను కాపాడటానికి ముందుకు రాలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా నిందితుడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు సంతోష్ పాఠక్ స్థానిక సిహావల్ ఎమ్మెల్యే విశ్వామిత్ర పాఠక్‌కు సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఘటనపై ఎమ్మెల్యే గానీ, బీజేపీ గానీ అధికారికంగా స్పందించలేదు. పూర్తిస్థాయి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BJP Leader Violence Hema Singh Bahri Latest News in Telugu Madhya Pradesh news Santosh Pathak Siddi District Incident Telugu News woman assaulted

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.