📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకెళ్లిన వ్యక్తి..కారణమిదే?

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 2:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భింద్ జిల్లాలోని రావత్‌పురా గ్రామంలో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మనం విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే, డిస్కం సిబ్బంది కరెంట్ సరఫరాను నిలిపేస్తారు. కానీ, ఇక్కడ ఓ రైతు చేసిన పని నిన్నటిదాకా ఎవరూ ఊహించనిది. కరెంటు బిల్లులు చెల్లించకుండా విద్యుత్ సరఫరా ఆపకుండా ఉండేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌నే దొంగిలించడం ఇప్పుడు పెద్ద వార్తగా మారింది.ఘటన వివరాలు,రావత్‌పురాకు చెందిన శ్రీరామ్ బిహారీ త్రిపాఠి (Shriram Bihari Tripathi) అనే రైతు తన వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ గ్రాంట్ కింద తాత్కాలికంగా 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను తన పొలంలో ఏర్పాటు చేయించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. బిల్లులు చెల్లించమని డిస్కం సిబ్బంది పలు సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు.

విద్యుత్ సరఫరా

దీంతో బిల్లు మొత్తం రూ. 1,49,795 వరకు పెరిగింది.దీంతో సిబ్బంది ఎలాగైనా తన విద్యుత్ సరఫరాను నిలిపివేసే అవకాశం ఉందని భావించి.ఓ వింత ఆలోచన చేశాడు.తన కుమారుడు సోను త్రిపాఠి సహాయంతో.. త్రిపాఠి ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి తన ఇంటికి తీసుకువెళ్లాడు.ఇంట్లోనే పెట్టుకుని తనకింక అస్సలే విద్యుత్ సరఫరా (Power supply) ఆపేయలని సంబుర పడిపోయాడు. కానీ ఈ ఘటన వెలుగులోకి రావడంతో అస్వార్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ సోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పనికి ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా తరలించినందుకు 2003 విద్యుత్ చట్టంలోని సెక్షన్ 136 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Madhya Pradesh

లోతుగా విచారణ

అలాగే దర్యాప్తును కూడా ప్రారంభించారు.శ్రీరామ్ బిహారీ త్రిపాఠియే ట్రాన్స్‍ఫార్మర్ దొంగిలించాడని తెలిసినప్పటికీ.. దొంగిలించబడిన ట్రాన్స్‌ఫార్మర్‌ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుగుతోంది. భారీ బకాయిలు పేరుకుపోయినందున విద్యుత్ కనెక్షన్ కట్ (Cut the connection) అవుతుందనే భయంతో ఒక ట్రాన్స్‌ఫార్మర్‌నే దొంగిలించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ, విద్యుత్ బిల్లుల వసూళ్ల విషయంలో ఇది ఒక కొత్త సవాలును విసురుతోంది.

మధ్యప్రదేశ్‌ లో ఫేమస్ అయిన ప్రదేశాలు ఏవి?

చారిత్రక స్థలాలు,వన్యప్రాణుల అభయారణ్యాలు,సాంస్కృతిక వారసత్వం,ఖనిజ సంపద.

మధ్యప్రదేశ్‌కు పూర్వపు పేరు ఏంటి?

మధ్యప్రదేశ్‌కు పూర్వపు పేరు “సెంట్రల్ ప్రావిన్సెస్” (Central Provinces) గా ఉండేది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Delhi: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన కారు

Bhind district news Breaking News farmer steals transformer Madhya Pradesh electricity theft Telugu News transformer theft incident unusual theft India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.