EKYC: LPG ఈ-కేవైసీ.. రేపటి వరకే ఛాన్స్

Follow Us: Google News Daily Hunt
The deadline for LPG gas e-KYC is ending on August 16! How can you complete the e-KYC process from home using your phone? What happens if you don't do it?
The deadline for LPG gas e-KYC is ending on August 16! How can you complete the e-KYC process from home using your phone? What happens if you don't do it?
FONT SIZE
GET APP

EKYC : గ్యాస్ వినియోగదారులకు హెచ్చరిక.. ఉచిత ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న వారితో పాటు సాధారణ డొమెస్టిక్ కనెక్షన్ ఉన్నవారు తక్షణమే తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంది. గ్యాస్ సిలిండర్ల ఈ-కేవైసీ గడువు రేపటితో (ఆగస్టు 23) ముగియనుందని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే, ప్రభుత్వం నుంచి ప్రతి నెలా ఖాతాల్లో జమ అయ్యే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.

Read Also : గజరాజుల ప్రాణాలు కాపాడిన అస్సాం అటవీ శాఖ

ఈ-కేవైసీ చేయకపోతే నష్టమేంటి? ఎలా పూర్తి చేయాలి?

ఈ-కేవైసీ పూర్తి చేయనంత మాత్రాన గ్యాస్ కనెక్షన్ పూర్తిగా రద్దు కాకపోయినప్పటికీ, వినియోగదారులు సబ్సిడీ లబ్ధిని కోల్పోతారు. దీనివల్ల సాధారణ డొమెస్టిక్ సబ్సిడీ ధరకు కాకుండా, సిలిండర్ కోసం మార్కెట్ రేటు ప్రకారం అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా సులభం. వినియోగదారులు తమకు సంబంధించిన గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్ (HP, Indane, Bharat Gas) ద్వారా ఇంట్లో నుంచే ఆధార్ ఫేస్ స్కానింగ్ లేదా ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు. లేదా దగ్గర్లోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాన్ని నేరుగా సందర్శించి ఆధార్, బయోమెట్రిక్ వివరాల ద్వారా ఈ-కేవైసీని త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు