LPG cylinder theft : చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. LPG సిలిండర్లతో నిండిన ట్రక్కును దుండగులు దొంగిలించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రూ.18 లక్షల విలువైన సిలిండర్లు మాయం
పోలీసుల సమాచారం ప్రకారం ఆ ట్రక్కులో మొత్తం 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.18 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ట్రక్కు దొంగతనానికి గురైనట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు
ఖాళీ ట్రక్కు మాత్రమే లభ్యం
పోలీసుల గాలింపు చర్యల్లో చివరకు ఆ ట్రక్కు పారీచా (LPG cylinder theft) ప్రాంతం దగ్గర హైవే పక్కన ఖాళీగా కనిపించింది. అయితే అందులో ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా లేకపోవడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.
GPS కూడా ధ్వంసం
ఈ ట్రక్కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్లాంట్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. హోలీ పండుగ కారణంగా డ్రైవర్ ట్రక్కును ప్లాంట్ బయట ఉంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో దుండగులు ట్రక్కును దొంగిలించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
అంతేకాదు ట్రక్కులో ఉన్న GPS వ్యవస్థను కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో దొంగతనానికి గురైన సిలిండర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :