📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Bengaluru: దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్

Author Icon By Vanipushpa
Updated: December 23, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అంటేనే అందరికీ ఒక పెద్ద భయం. అదే ట్రాఫిక్. అక్కడ గంటల కొద్దీ రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ “నమ్మ మెట్రో” జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. రాబోయే రెండేళ్లలో బెంగళూరు మెట్రో నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ప్రకటించారు. 2026 మే నుంచి డిసెంబర్ లోపు అదనంగా 41.01 కిలోమీటర్ల మెట్రో లైన్లు అందుబాటులోకి రానున్నాయి. పింక్ లైన్‌లోని కాలేన అగ్రహార నుంచి తావరేకెరె వరకు (6 స్టేషన్లు) ఎలివేటెడ్ విభాగం ప్రారంభం అవుతుంది. డెయిరీ సర్కిల్ నుంచి నాగవార వరకు ఉన్న 13.76 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ లైన్ (12 స్టేషన్లు), సిల్క్ బోర్డ్ జంక్షన్ నుంచి కె.ఆర్ పురం వరకు ఉన్న 19.75 కిలోమీటర్ల లైన్ (ఫేజ్ 2A) అందుబాటులోకి వస్తాయి.

Read Also: Australia: బాండీ బీచ్ ఘటన.. కొడిక్కి తండ్రే శిక్షణ…

Bengaluru

ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎప్పుడు వస్తుంది?

దీనివల్ల ప్రస్తుతం ఉన్న 96.1 కిలోమీటర్ల మెట్రో పొడవు కాస్తా 137.11 కిలోమీటర్లకు చేరుకుంటుంది. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లాలంటే ఇక ట్యాక్సీల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. 2027 జూన్ నాటికి హెబ్బాల్ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 27 కిలోమీటర్ల లైన్ సిద్ధమవుతుంది. అదే ఏడాది డిసెంబర్‌లో హెబ్బాల్-కె.ఆర్ పురం మార్గం కూడా పూర్తవుతుంది. దీంతో 2027 ముగిసేసరికి బెంగళూరు మెట్రో నెట్‌వర్క్ ఏకంగా 175.55 కిలోమీటర్లకు విస్తరిస్తుంది. జేపీ నగర్ 4వ ఫేజ్ నుంచి కెంపాపుర వరకు, హోసహల్లి నుంచి కడబగెరె వరకు ఈ కొత్త లైన్లు ఉంటాయి. దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సుమారు రూ. 6,775 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించింది. నగరం నడిబొడ్డునే కాకుండా బిడది, నెలమంగళ, హోస్కోటె, తావరేకెరె వంటి శివారు ప్రాంతాలకు కూడా మెట్రోను మరో 100 కిలోమీటర్ల మేర పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

double decker road project India infrastructure development Longest double decker corridor Paper Telugu News smart city infrastructure Telugu News online Telugu News Today urban transport corridor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.