ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని తన ప్రసంగంలో కరోనా మహమ్మారి (Pandemic) నాటి పరిస్థితులను ప్రస్తావించడంతో, మళ్ళీ దేశంలో లాక్ డౌన్ (Lockdown) విధిస్తారా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ప్రధాని మోదీ తన తాజా ప్రసంగంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను వివరిస్తూ.. కరోనా సమయాన్ని గుర్తు చేశారు. అయితే ఇది జబ్బుల గురించి కాదు, ఆర్థిక వ్యవస్థ , సరఫరా వ్యవస్థ గురించి. మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా రవాణా ఎలాగైతే ఆగిపోయిందో, ఇప్పుడు యుద్ధం వల్ల అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకం కలుగుతోందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని, అప్పట్లో లాగే ఇప్పుడు కూడా మనం స్వయం సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: Mamata Banerjee : పశ్చిమ రాజకీయ గాలి ఎటు వీచేనో!
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి లేదు, కాబట్టి గతంలో లాగా ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే లాక్ డౌన్ (Lockdown) విధించే అవకాశం లేదని, ప్రధాని మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యుద్ధం వల్ల వస్తువుల ధరలు పెరగవచ్చు. కానీ, జనజీవనం స్తంభించిపోయే పరిస్థితులు ప్రస్తుతం లేవని చెప్తున్నారు. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతూ.. గ్యాస్, పెట్రోల్ సరఫరాకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తితే మాత్రం దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదు.
Read hindi news : hindi.vaartha.comPolitics
Epaper : epaper.vaartha.com
Read Also: