📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Live-in relationship: సహజీవనంపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

Author Icon By Sushmitha
Updated: December 6, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యువతీ యువకుల సహజీవనం (Live-in Relationship) విషయంలో రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) ఒక సంచలన తీర్పును వెలువరించింది. వివాహ వయస్సు (Marriageable Age) ఇంకా రాకున్నా సరే, యువతీ యువకులు మేజర్లైతే (Majority Age) పరస్పర ఆమోదంతో సహజీవనం చేయొచ్చని కోర్టు స్పష్టం చేసింది. వివాహ వయస్సు రాలేదన్న ఏకైక కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన స్వేచ్ఛా హక్కును (Right to Liberty) కాదనలేమని న్యాయస్థానం పేర్కొంది.

Read Also:  Pak-Afg: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ కాల్పులు

Live-in relationship Rajasthan High Court’s sensational verdict on cohabitation

ఈ మేరకు, 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. యువకుడికి వివాహ వయస్సు (21 ఏళ్లు) రాలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని, దీనిని నేరంగా కూడా పరిగణించలేమని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేశారు.

యువతి కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం

కోర్టును ఆశ్రయించిన ఈ యువ జంట, తామిద్దరూ పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, యువతి కుటుంబ సభ్యులు తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు తగిన రక్షణ కల్పించాలని యువకుడు కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ జంట ఆరోపించింది.

ఈ నేపథ్యంలో, యువతి కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందన్న యువకుడి ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆ జంటకు తక్షణమే రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Article21Right Google News in Telugu IndianLaw Latest News in Telugu LegalRuling LiveInRelationship MarriageableAge PoliceProtectionOrder RajasthanHighCourt SexualLiberty Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.