Liquid Ganja: లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు

Read Time:  1 min
Liquid Ganja: లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు
FONT SIZE
GET APP

Liquid Ganja: ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో గుట్టుగా సాగుతున్న భారీ లిక్విడ్ గంజాయి (Ganja) తయారీ కేంద్రం గుట్టును కోరాపుట్టు పోలీసులు భగ్నం చేశారు. కూరపుట్టు జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో పడవలపై ఘటనా స్థలానికి చేరుకుని లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రంపై దాడి చేశారు. కోరాపుట్ పోలీసులు జిల్లాలో అంతర్రాష్ట్ర హషీష్ ఆయిల్ ( ద్రవ గంజాయిని) తయారీ కర్మాగారాన్ని ఛేదించడం ద్వారా చారిత్రాత్మక ఘనతను సాధించారు. పాడు వా పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఒడిశా ఆంధ్ర సరిహద్దులోని పాడువా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జోలాపుట్ రిజర్వాయర్ సమీపం లోని అటవీ ప్రాంతంలో ఈ అక్రమ లిక్విడ్ గంజాయి ప్రోసెసింగ్ యూనిట్ పనిచే స్తున్నట్లు సమాచారం అందడంతో గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం దాడులు జరిపి 1800 లీటర్లకు పైగా హషీష్ ఆయిలు(లిక్విడ్ గంజాయి) స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

Liquid Ganja: లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు
Liquid Ganja: Liquid Ganja Manufacturing Center in Gutturattu

200 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం

దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. దీనితో పాటు, 1000 కిలోలకు పైగా ముడి సరుకు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆపరేషన్ సమయంలో, తాత్కా లిక తయారీ యూనిట్ నుండి వివిధ వస్తువులను కూడా పోలీ సులు స్వాధీనం చేసుకున్నారని డిఐఎజి కన్వర్ విశాల్ సింగ్ విలేకరులకు తెలిపారు. నిఘా సమాచారం ఆధారంగా కోరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు.

రోడ్డు మార్గాలను ఉపయోగించ కుండా, పడవ మరియు కాలినడకన రహస్యంగా ఆ ప్రదేశానికి పోలీసు బృందం చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులను గుర్తించామని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఆయన వెల్లడించారు. హషీష్ ఆయిల్ తయారీలో అంతర్రాష్ట్ర సంబంధం ఉందని ప్రాథమిక ఆధారాలు లభించాయి. పాడువా పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తర్వాత తెలియజేస్తామని కోరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ తెలిపారు.

రెండు వాహనాలు సీజ్ నలుగురు అరెస్ట్

అదేవిధంగా ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బిర్రీగూడ ప్రాంతం నుండి ఒడిస్సా మీదుగా నంద పూర్ వైపు రెండు బొలెరో వాహనాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 1,144 కిలోల గంజాయిని ఒడిస్సా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు బొలెరో వాహనాలను సీట్ చేశారు. గంజాయి ఆక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితు లను ఒడిస్సా పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. రెండు చోట్ల పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ 200 కోట్లు ఉంటుందని ముడి సరుకు గంజాయి విలువ ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.