📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Latest News: Lionel Messi: ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

Author Icon By Anusha
Updated: December 14, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ పర్యటన అదిరింది! రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగించి, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. రాహుల్ గాంధీని కలిసిన మెస్సీ ఆ తర్వాత సన్మానం అందుకున్నాడు. కోల్‌కతాలో జరిగిన గందరగోళానికి పూర్తి భిన్నంగా, హైదరాబాద్‌లో మెస్సీ పర్యటన విజయవంతమైంది. 

Read Also: Naga Vamsi: HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

సచిన్ టెండూల్కర్‌తో మెస్సీ భేటీ

మెస్సీ (Lionel Messi) తన ‘గోట్ టూర్’లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ముంబై చేరుకున్నాడు. తన భారత పర్యటనలో కోల్‌కతా, హైదరాబాద్‌ల తర్వాత ఇది మూడో మజిలీ. ముంబైలో మెస్సీ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే ఓ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో మెస్సీ భేటీ కానున్నాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు వాంఖడే స్టేడియంలో బాలీవుడ్ ప్రముఖులతో కలిసి మెస్సీ ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

‘గోట్ ఫుట్‌బాల్ క్లినిక్’‌లో భాగంగా

అనంతరం జరిగే ఓ ప్రైవేట్ ఫ్యాషన్ షోలో, 2022 ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించిన తన వస్తువులను మెస్సీ వేలం వేయనున్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘గోట్ ఫుట్‌బాల్ క్లినిక్’‌లో భాగంగా మెస్సీ చిన్నారులకు ఫుట్‌బాల్ మెళకువలు నేర్పించనున్నాడు. భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాడని తెలుస్తోంది.

నిన్న కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకుల వైఫల్యం కారణంగా గందరగోళం చెలరేగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ముంబై పర్యటన ముగిశాక, మెస్సీ తన టూర్‌లో చివరి నగరమైన ఢిల్లీకి బయలుదేరి వెళతాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Lionel Messi Messi Goa Tour Messi Mumbai visit Sachin Tendulkar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.