జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై చర్చించారు. అయితే, ఈ సమావేశం అనంతరం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor)ప్రమోట్ కాగా తాను డిమోట్ అయ్యానని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
ప్రధానితో అనుబంధం
శుక్రవారం చీనాబ్ వంతెన, కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌లోని అన్ని రైల్వే ప్రాజెక్టుల్లో ప్రధానితో అనుబంధం కలిగి ఉండటం తన అదృష్టమని అన్నారు.
రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి
మొదటిది అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, రెండవది బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొన్నట్లు ఒమర్ అబ్దుల్లా గుర్తుచేశారు. ‘2014లో కాట్రా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదోన్నతి పొందారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్రపాలిత ప్రాంతం సీఎంగా నన్ను తగ్గించారు. కానీ మనకు తెలియకముందే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తారు’ అని అన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను మోదీ ముందు ఇలా ప్రస్తావించారు.
Read Also:Narendra Modi: చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ