📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Layoff:భారీగా లే ఆఫ్ లను ప్రకటించేందుకు సిద్ధపడుతున్న అమెజాన్

Author Icon By Sushmitha
Updated: October 28, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) (ఏఐ) వచ్చాక టాప్ కంపెనీలుసైతం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే పనిలో పడ్డాయి. పలు దేశాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. దీంతో ఐటీరంగాలు సైతం తమ సిబ్బందికి వేతనాల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఆర్థిక పొదుపులో భాగంగా తమ ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటున్నాయి.

ఇందులో తాజాగా అమెజాన్ కంపెనీ(Amazon Company) దాదాపు 30వేల మంది ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్నది. ఈవారం నుంచి ప్రారంభమయ్యే కొత్త రౌండ్ తొలగింపులలో సుమారు 40వేలమంది కార్పొరేట్ ఉద్యోగులు ప్రభావితమవుతారని అంతర్గత వర్గాల సమాచారం. ఏఐ ఆధారిత కార్యకలాపాల పునర్నిర్మాణం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Read Also: Cricket: బీసీసీఐపై ఐసీసీ మాజీ రిఫరీ సంచలన ఆరోపణలు

ఇంకా అధికారికంగా వెలువడని ప్రకటన

ఈ తొలగింపులపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులు క్లౌడ్ కంప్యూటింగ్, పరికరాలు, కమ్యూనికేషన్స్, రిటైల్ కార్యకలాపాలు వంటి అనేక విభాగాలనుప్రభావితం చేయనున్నాయి. ఈ నివేదికలపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది. ప్రస్తుతం అమెజాన్ లో ప్రపంచవ్యాప్తంగా 1.54 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 3.5 లక్షలమంది కార్పొరేట్ ఉద్యోగులు, మిగతా వారు గిడ్డంగి, లాజిస్టిక్స్ విభాగాల్లో పనిచేస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో అమెజాన్ 27వేలమందికి పైగా ఉద్యోగులను తొలగించింది. తాజా నిర్ణయం ఆ పునర్నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది.

98వేలమంది ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీలు

లేఆఫ్స్ డేటా ప్రకారం 2025లో ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు దాదాపు 98వేలమంది ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఏఐ అభివృద్ధి, ఆటోమేషన్ వైపు వనరులను మళ్లిస్తూ గణనీయమైన లే ఆఫ్లు ప్రకటించాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ ప్రణాళికలు త్వరలోనే సాంకేతిక రంగంలోని ఉద్యోగ మార్కెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అమెజాన్ వంటి పెద్ద సంస్థలే ఏఐలో పెట్టుబడులు పెంచుతున్నప్పటికీ, దాని ప్రభావం ఉద్యోగ అవకాశాలపై చూపుతోంది. వేలాదిమంది ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళనను రేకెత్తించింది.

అమెజాన్ ఈసారి ఏ విభాగంలో లేఆఫ్‌లు ప్రకటించే అవకాశం ఉంది?

ఈసారి ప్రధానంగా హ్యూమన్ రిసోర్సెస్ (HR) విభాగంలో మరియు కంపెనీకి మద్దతు ఇచ్చే ఇతర విభాగాలలో లేఆఫ్‌లు ఉండవచ్చు.

ఈ లేఆఫ్‌లకు ముఖ్య కారణం ఏమిటి?

కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలని చూడటం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉత్పత్తులలో భారీగా పెట్టుబడి పెట్టడం ప్రధాన కారణాలు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AI job impact Amazon layoffs Google News in Telugu HR department Latest News in Telugu tech job cuts Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.