📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Toll Fee టూవీలర్లకు టోల్ ఫీజు లేదు.. కేంద్రం క్లారిటీ

Author Icon By Anusha
Updated: August 21, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలపై (టూవీలర్లపై) టోల్ ఫీజు (Toll Fee) వసూలు చేయబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిస్తూ, అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించింది. గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, టూవీలర్లపై ఎలాంటి యూజర్ ఫీజు వసూలు చేయడం లేదని స్పష్టంచేసింది.ఈ ప్రకటనలో, “దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ద్విచక్ర వాహనాల నుంచి యూజర్ ఫీజు వసూలు చేయడం లేదు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే టోల్ వసూళ్లు కొనసాగుతున్నాయి. ఈ నిబంధనల్లో మార్పులు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వానికి లేదు” అని పేర్కొంది.

ఇటీవల కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో

ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ రహదారుల ఫీజు (నిర్ణయం, సేకరణ) నిబంధనలు – 2008 ప్రకారం, టోల్ వసూళ్లు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు కలిగిన వాహనాలపైనే వర్తిస్తాయి. అంటే కారు, జీపు, వ్యాన్, తేలికపాటి వాణిజ్య వాహనాలు, బస్సులు, ట్రక్కులు, భారీ నిర్మాణ యంత్రాలు, మల్టీ యాక్సిల్ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రెండు చక్రాల వాహనాలు (మోటార్ సైకిళ్లు, స్కూటర్లు) మూడు చక్రాల వాహనాలు (ఆటోలు) మాత్రం టోల్ ఫీజు పరిధిలోకి రావు.ఇటీవల కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టూవీలర్లకు కూడా టోల్ ఫీజు విధించాలని నిర్ణయం తీసుకుందని ప్రచారం జరిగింది. ఈ పోస్టులు కొంతమంది వాహనదారులలో సందేహాలు రేకెత్తించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వార్తలను పూర్తిగా నకిలీవని కొట్టిపారేసింది. ఈ రకమైన తప్పుడు వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది.

Latest News

రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ పాసుల అమ్మకాలు

ప్రస్తుత నిబంధనల ప్రకారం, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వర్తిస్తుంది. కారు, జీపు, వ్యాన్, తేలికపాటి వాణిజ్య వాహనం, బస్సు, ట్రక్కు, భారీ నిర్మాణ యంత్రాలు, మల్టీ యాక్సిల్ వాహనాల వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.ఇదే సమయంలో ఎన్‌హెచ్‌ఏఐ కేవలం నాలుగు రోజుల్లోనే 5 లక్షలకు పైగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక టోల్ పాసులను విక్రయించినట్లు తెలిపింది. ఈ అమ్మకాల ద్వారా రూ. 150 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. ప్రైవేట్ వాహనాల కోసం ఉద్దేశించిన ఈ వార్షిక పాసు ధరను రూ. 3,000గా నిర్ణయించారు. ఈ పాసు కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 టోల్ ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుంది. వీటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది.వార్షిక పాసులను అత్యధికంగా కొనుగోలు చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక, హర్యానా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ పాసుల ద్వారా అత్యధిక లావాదేవీలు జరిపిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తన ప్రకటనలో పేర్కొంది.

టోల్ ఫీజు అంటే ఏమిటి?

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు లేదా వంతెనలు, టన్నెల్‌లు వంటివి నిర్మాణం, సంరక్షణ కోసం ప్రభుత్వం వాహనదారుల నుంచి వసూలు చేసే రుసుమే టోల్ ఫీజు.

టోల్ ఫీజు ఎందుకు వసూలు చేస్తారు?

రహదారుల నిర్మాణ వ్యయం, నిర్వహణ ఖర్చు, భద్రతా చర్యలు,ఆధునిక సదుపాయాల కోసం వాహనదారుల నుండి ఈ ఫీజు వసూలు చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rekha-gupta-delhi-cm-security-increased/national/533772/

Breaking News expressways fake news government clarification latest news Motorcycles national highways scooters Telugu News toll fee two wheelers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.